బిజెపి నేతలపై టిఆర్ఎస్ ఎంపి కవిత ఒకింత గట్టిగానే ఫైర్ అయ్యారు. తన తండ్రి తెలంగాణ సిఎం కేసిఆర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మాట్లాడిన భాషలో తప్పేం లేదన్నారు. మాటల మధ్యలో మోడీ గారు అనే సందర్భంలో దొర్లిన మాట తప్ప సంచకుచిత స్వభావంతో ప్రధానిని అవమానించాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు. అది రొటీన్ గా జరిగిన అంశమేనన్నారు. ఏమీలేని అంశాన్ని పట్టుకుని బిజెపి వాళ్లు ఇష్టమొచ్చిన తీరుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దావోస్ లో 600 కోట్ల ప్రజలు తనకు ఓట్లేశారని మోడీ కామెంట్ చేస్తే.. దాన్ని మేము ఏమైనా మోడీగారిపై విమర్శలు చేశామా? అని బిజెపి నేతలను ప్రశ్నించారు. ఎంపి కవిత ఇంకా ఏమన్నారో వీడియోలో చూడండి.
Just meaningless comments
Needs to say SORRY TO MODIJI
————————
BUCHI REDDY GANGULA