రేపటి నుంచి (మార్చి 2) నుంచి దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ థియేటర్లలలో సినిమాలు నిలిపి వేతకు పిలుపునిచ్చింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డిఎస్పి) అధికమొత్తంలో టారిఫ్ వసూలు చేస్తూ ఉండటంతో దీనికి నిరసనగా చిత్ర ప్రదర్శనలు నిలిపివేయాలని నిర్ణయించారు.
డిఎస్ పి ల విధానం వల్ల నిర్మాతలమీద, పంపిణీదారులమీద పెద్ద మొత్తంలో భారం పడుతున్నదని వారు వాదిస్తున్నారు. డిఎస్పీలు థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని కాంట్రాక్టుల పేరుతో భారీ మొత్తాల్ని గుంజుతున్నారన్న అరోపిస్తూ, ఈ విధానం రద్దుచేయాలని వారు బంద్ కు పిలుపు నిచ్చారు.
ఇప్పటికే పలుమార్లు డిజిటల్ సర్వీస్ ప్రొడైడర్ల యాజమాన్యలతో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ చ ర్చలు జరిపినా విఫలమవ్వడంతో శమరశంఖం పూరించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో తెలుగు ఫిల్మ్ ఛాంబార్ ఆఫర్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ దామోదర్ ప్రసాద్, సెక్రటరీ ముత్యాల. రామదాసు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రామదాసు మాట్లాడుతూ, `మార్చి 2 నుంచి థియేటర్లలలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నాం. రెండు నెలల నుంచి డిజిటల్ ధరలు భయంకరంగా పెంచేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఒకరి ఏర్పాటు చేశాం. కమిటీ చైర్మన్ గా డి.సురేష్ బాబు , కన్వీనర్ గా పి. కిరణ్ బాధ్యతలు తీసుకున్నారు. దీనికి ముందు ఆరు సంవత్సరాల నుంచి సురేష్ బాబు, సి.కల్యాణ్, ఎన్. వి ప్రసాద్ అంతా కలిసి పోరాటం చేసినా డిజిటల్ యాజమాన్యాలు దిగిరాలేదు. చివరికి సమావేశాలకు గౌర్హజరయ్యేవారు. ఇలాంటి పరిస్థితుల్లోనే జాయింట్ యాక్షన్ కమిటీ (సౌత్ లో ఫిల్మ్ ఇండస్ర్టీ అన్ని) ఏర్పాటు చేశాం. దాని ఆధ్వర్యంలో హైదరాబాద్, చైన్నై, బెంగుళూరులో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల యాజమన్యాలతో పలు అంశాలపై చర్చలు జరిపాం. అవి విఫలమయ్యాయి. అలాగే ఈరోజు ఉదయమే తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరుపున ఎల్లవెళలా సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. మా పోరాటానికి ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలో ఉన్న అన్ని థియేటర్ల యాజమాన్యాలు పూర్తిగా మద్దతునిచ్చాయి. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీ దారులు అంతా ఒకే తాటిపైకి వచ్చి పోరాటం చేయడానికి సిద్దమయ్యాం. ధియేటర్ల నిలిపివేత అన్నది ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేం. మా పోరాటినికి ప్రేక్షకులకు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబార్ ఆఫర్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, `ఇప్పటివరకూ జరిగిన సమావేశాల్లో ప్రధానం మూడు అంశాలపై చర్చలు జరిగాయి. 1.వి.పి.ఎఫ్ ఛార్సెస్ కట్టేది లేదని.. 2. రెండు సినిమా యాడ్లు మాకివ్వాలని, 3. కమర్శియల్ యాడ్లు 8 నిమిషాల నిడి కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధనలను వాళ్ల ముందుంచాం. వరల్డ్ వైడ్ వి.పిఎస్ ఛార్జెస్ 5 ఏళ్లు మాత్రమే అనుకున్నాం. తర్వాత పూర్తిగా నిషేధించాలని ముందుగా అనుకున్నాం. కానీ ఇప్పటికి అదే విధానం కొనసాగుతుంది. దీనిపై జరిగిన చర్చలన్నీ విఫలమయ్యాయి. క్యూబ్ కు సంబంధింన ఓ వ్యక్తి అయితే చివరి సమావేశంలో `ఆల్ ది బెస్ట్ టు ఇండస్ర్టీ` అంటూ వ్యంగ్యంగా మాట్లాడి అంత మంది పెద్దల ముందే లేచి వెళ్లిపోయాడు. మా సినిమా ఇండస్ర్టీ మీద ఆధారపడి బ్రతికే వ్యక్తే అలా మాట్లాడడం ఎంతవరకూ సంస్కరమో? అతనికే తెలియాలి. ఇక ఉపేక్షించేది లేదు. దక్షిణాది అన్ని చలన చిత్ర పరిశ్రమల నుంచి పూర్తిగా మద్దుతు లభించింది. మార్చి 2 నుంచి సినిమా ప్రదర్శనలను నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నాం. కావునా ప్రేక్షకులు అంతా సహకరించాలని కోరుకుంటున్నాం` అని అన్నారు.