కొడంగల్ లో టెన్షన్.. రేవంత్ అరెస్ట్ కు యత్నం
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బిటి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో వివాదం నెలకొంది. మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అనుకున్న సమయానికి రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎంపిటిసి, సర్పంచ్ చేత కానిచ్చేశారు. దీంతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలో శిలాఫలకం ధ్వంసమై కూలిపోయింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలందరినీ పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్ ను అరెస్టు చేసే క్రమంలో ఆయన బైక్ మీద అక్కడి నుంచి తప్పించుకున్నారు. తాజాగా కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీడియోలో తోపులాట ఎలా జరిగిందో చూడొచ్చు.