భారత దేశపు చిత్రసీమ అతిలోక సుందరి ఫిమెల్ సూపర్ స్టార్ శ్రీదేవి(54)దుబాయ్ లో గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రిగుండెపోటు రావడంతో ఆమె కన్నుమూశారని ఆమె బావ సంజయ్‌కపూర్ ధ్రువీకరించారు. దుబాయ్ లో ఒక వివాహం కోసం భర్త బోనీ కపూర్ ,కూతురు కుషీ తో కలసి ఆమె దుబాయ్ వచ్చారు. (కింది వీడియో)
చివరి క్షణాలలో భర్త, కూతురు ఆమె పక్కనే ఉన్నారు. 1963 ఆగస్టు 13న శ్రీదేవి శివకాశిలో జన్మించారు. నాలుగు సంవత్సరాల వయసులోనే ఆమె ఎంఎ తిరుముగం భక్తి రసం చిత్రం తునైవన్ తో లోనటించారు.
అపుడు మొదలైన సినీ ప్రస్తానం, అపుడుపుడు విరామం ఉన్నా చివరి దాకా కొనసాగుతూ వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో నటించి అద్భుతమయిన నటన కౌశలం ప్రదర్శించి ఫిమెల్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న ఏకైక నటి శ్రీదేవి. చివర్లో బాలివుడ్ లో సెటిల్ అయినా తొలి బావుడ్ చిత్రం 1975లో వచ్చిన జూలీ. 1976లో మూండ్ర ముడిచి తో ఆమె నటిగా ఎదిగారు. తెలుగు తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటిగా నిల్చారు.
బాలివుడ్ కు సంబంధించి సోల్వా సావన్ (1978) తోపున: ప్రవేశం జరిగింది. హిమ్మత్ వాలా (1983)తో ఆమె అడ్రసు బాలివుడ్ కు మారింది. తర్వాత మవాలి(1983), తోఫా(1984), నయా కదమ్ (1984)మక్సాద్ (1984),మస్తేరి(1985),నజ్రానా(1987),మిస్టర్ ఇండియా(1987), వక్త్ కి అవాజ్(1988) చాందినీ(1984) ఆమె చేసిన కొన్ని సూపర్ హిట్ చిత్రాలు. సద్మా (1983), నగీనా(1986), చాల్ బాజ్(1989), లమ్హే(1991),ఖుదా గవా(1992), గుమ్రా(1993)జుదాయ్91997) వంటి కమిర్షియల్ సూపర్ హిట్స్. అయితే,దాదాపు 15 సంవత్సరాలు విరామం తీసుకున్నారు.
మళ్లీ 2013లో ఇంగ్లీష్ వింగ్లీష్ హిందీ చిత్రంతో నటనా ప్రపంచంలోకి వచ్చారు.2013లో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది. సిఎన్ ఎన్ ఐబిఎన్ లోజరిగినఒక సర్వేవందేళ్ల సినిమా రంగంలో భారత దేశపు ఒకగొప్పనటిగా ఎంపికయ్యారు. 1996లో బోనీకపూర్‌తో శ్రీదేవికి వివాహమైంది. ఆమె కూతుర్లు.
ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు. ఎన్.టి.రామారావుతో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించారు. అగ్ర శ్రేణి నటులందరితో ఆమె నటించిన చిత్రాలు అణిముత్యాలుగా మిగిలిపోయాయి.
ఎ.నాగేశ్వరరావుతో ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారరు. కృష్ణ గారితో కలిసి ఆమె కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ తరువాత, శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆదిలో, ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు, వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినవి, ముఖ్యంగా కె. రాఘవేంద్ర రావు గారు మరియు కె.బాపయ్య గారు దర్శకత్వం వహించినవి.
ఆమె నటించిన తెలుగు చిత్రాలు :
పదహారేళ్ల వయసు (1978),ఎర్రగులాబీలు (1978) (సిగప్పు రోజక్కల్ – అను చిత్ర అనువాదం),బుర్రిపాలెం బుల్లోడు (1979),కార్తీక దీపం (1979) వేటగాడు (1979),క్యలాణ రాముడు (1979)ముద్దుల కొడుకు (1979),ఆటగాడు (1980),చుట్టాలున్నారు జాగ్రత్త (1980),దేవుడిచ్చిన కొడుకు (1980)ఘరానా దొంగ (1980),కక్ష (1980),మామా అల్లుళ్ల సవాల్ (1980) ప్రేమకానుక (1980) రౌడిరాముడు కొంటె కృష్ణడు(1980) సర్దార్ పాపారాయుడు, (1980), గజదొంగ (1980), సిఐడి (1980)మోసగాడు (1980)పాటగాడు (1980), ఆకలి రాజ్యం (1981) బాలనాగమ్మ (1981).
భోగభాగ్యాలు (1981),ఘరానా దొంగలు (1981),గడసరి అత్త-సొగసరి కోడలు (1981),కొండవీటి సింహం (1981)
ప్రేమాభిషేకం (1981) (హైదరాబాద్ లో 500 రోజులకి పైగా ఆడింది)రాణికాసుల రంగమ్మ (1981),ఇల్లాలు (1981), సత్యం శివం(1981),గురుశిష్యులు (1981),ఆదివిష్ణులు (1982),అనురాగ దేవత (1982),బంగారు భూమి (1982),బంగారు కానుక(1982),బంగారు కొడుకు (1982), బొబ్బిలి పులి (1982),దేవత (1982).
బాలివుడ్ కు సంబంధించి సోల్వా సావన్ (1978) తోపున: ప్రవేశం జరిగింది. హిమ్మత్ వాలా (1983)తో ఆమె అడ్రసు బాలివుడ్ కు మారింది. తర్వాత మవాలి(1983), తోఫా(1984), నయా కదమ్ (1984)మక్సాద్ (1984),మస్తేరి(1985),నజ్రానా(1987),మిస్టర్ ఇండియా(1987), వక్త్ కి అవాజ్(1988) చాందినీ(1984) ఆమె చేసిన కొన్ని సూపర్ హిట్ చిత్రాలు. సద్మా (1983), నగీనా(1986), చాల్ బాజ్(1989), లమ్హే(1991),ఖుదా గవా(1992), గుమ్రా(1993)జుదాయ్91997) వంటి కమిర్షియల్ సూపర్ హిట్స్. అయితే,దాదాపు 15 సంవత్సరాలు విరామం తీసుకున్నారు. మళ్లీ 2013లో ఇంగ్లీష్ వింగ్లీష్ హిందీ చిత్రంతో నటనా ప్రపంచంలోకి వచ్చారు.2013లో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది. సిఎన్ ఎన్ ఐబిఎన్ లోజరిగినఒక సర్వేవందేళ్ల సినిమా రంగంలో భారత దేశపు ఒకగొప్పనటిగా ఎంపికయ్యారు. 1996లో బోనీకపూర్‌తో శ్రీదేవికి వివాహమైంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు,ఖుషీ, జాహ్నవి.