నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య నేడు విజయవాడలో వినూత్న నిరసన నిర్వహించింది. ఈ సంస్థ కార్యకర్తులు లెనిన్ సెంటర్లో రోడ్డు మీద మోదీ పకోడీ కొట్టు పెట్టారు.
పెద్ద చదవుకున్న వారికి కూడా ఉద్యోగాల కొరత తీరడం లేదని, గత మూడున్నర సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉపాధి కల్పన అటకెక్కిందని విద్యార్థులు విమర్శించారు. దీనిని నిరసనగా చదువుకున్న నిరుద్యోగులు బతుకు దెరువు కోసం ఇలా రోడ్ల మీద పకోడి లు అమ్ముకునే పరిస్థితి వస్తున్నదని వారు చెప్పారు. మోదీ పకోడిలు అని అరుస్తూ వారు పకోడిలను విక్రయించి నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా ఏ ఐ వై ఎఫ్ నాయకుడు ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు :
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బీజేపీ, టీడీపీ హామీలు గుప్పించారు
అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారు ?
ఉద్యోగాలు అడుగుతుంటే మోదీ పకోడీలు అమ్మోకోమని చెప్పడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం
ఏపీలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి లోకేష్ చెప్పడం సిగ్గుచేటు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి
నిరుద్యోగులు అగ్రహిస్తే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలి