దివిసీమలో మొక్కజొన్న పంటకు సాగునీరు అందించాలని డిమాండు చేస్తూ అవనిగడ్డలో రైతులు అర్ధనగ్నంగా ర్యాలీ జరిగింది. వంతెన సెంటర్ నుంచి కోర్టు సెంటర్ వరకు అర్ధ నగ్నంగా ఈ పాదయాత్ర చేశారు. ఎడ్లబళ్లతో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై నిరాహార దీక్ష చేశారు. అవనిగడ్డ, నాగాయలంక మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు గుడివాక శివరావ్, బీసాబత్తిన ప్రసాద్, సీపీఎం నాయకులు శీలం నారాయణ, సీపీఐ నేతలు అఢ్డాడ ప్రసాద్, సురేంద్రనాధ్ బెనర్జీ, నారెపాలెం శంకరరావు, బీజేపీ నాయకులు గుడివాక అంజిబాబు, జీవీ నగరాయలు, జనసేన నేత రాయపూడి వేణుగోపాల్, దివిసీమ వెల్ఫెర్ సొసైటీ అధ్యక్షులు అన్నపరెడి వెంకటస్వామి ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు.
మొక్కజొన్నకు సాగునీరు అందించాలని ఆందోళన చేస్తున్నా స్పందించక పోవడంతో తుంగలవారిపాలెంకు చెందిన గొర్రుముచ్చు శ్రీను వంతెన సెంటర్ లొ పురుగుల మందుతో ఆత్మహత్యా యత్నం చేశారు.అయితే, నాయకులు అడ్డుకున్నారు. ఆందోళన సందర్భంగా రైతులకు సీఐ మూర్తి కి మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి.