సిఎం చంద్రబాబు పరువు తీసిన మంత్రి ఆదినారాయణ రెడ్డి (వీడియో)

 

తెలుగుదేశం మంత్రులు,ఎమ్మెల్యేలు ఎలా లంచాలు,కమిషన్లు పంచుకుంటారో కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయణ రెడ్డి చాలా చక్కగాచెప్పారు. ఆయన వైసిపి వదిలి , టిడిపిలో చేరి మంత్రి అవుతున్నపుడు, ఆ నియోజకవర్గంలో టిడిపికి అండగా ఉన్న మాజీ మంత్రి  రామసుబ్బారెడ్డి తిరుగుబాటు చేస్తాడని, ఆయన ఇక వైసిపిలోకి ఉడాయిస్తాడని అనుకున్నారు. దానికితోడు అపుడపుడు  నియోజకవర్గం రెండు వర్గాల మధ్య గొడవలు కూడా జరుగుతూ వచ్చాయి, అందువల్ల ఇక రామసుబ్బారెడ్డి పార్టీ మారడమే మిగిలింది అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమయిన రాజీ ఫార్ములా రూపొందించారు. అంతే,  గొడవలు లేవు. మాయం. సుఖాంతం.అదాయం పెరిగింది.

మంత్రి ఆదినారాయణ రెడ్డి, ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి కమిషన్లను మామూళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన ఫార్ములా ప్రకారం పంచుకుంటున్నారు

రామసుబ్బారెడ్డి చక్కగా ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రితో రాజీ పడ్డారు. ఇపుడు  జమ్మలమడుగు ప్రశాంతంగా ఉంది. కిందిస్థాయి కార్యకర్తలు పిచ్చోళ్లు. నాయకుల కోసం ప్రాణాలకు తెగిస్తూ ఉంటారు. కానినాయకులు కమిషన్లు,మామూళ్లు పంచుకునేందుకు ఎలా చేతులు కలుపుతారో చూడండి. అంతేకాదు, పంపకం ఫార్ములాను ముఖ్యమంత్రే స్వయంగా నిర్ణయించారు. సాక్షులు ఐఎఎస్ ఆఫీసర్లు. ఈ విషయం ఎదో మీడియాలో వచ్చింది. కాదు ఒక కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి స్వయంగా వెల్ల డించారు. ముఖ్యమంత్రిచంద్రబాబు పరువు బజారు కీడ్చారు ఇలాా.

రాజకీయాల్లో మామ లూళ్లు పంచుకోవడం మామూలే కాని, దానిని ఎవరూ ఎండార్స్ చేయరు. గాని ఆ లెక్కన మంత్రి ఆదినారాణయరెడ్డి గవర్నెన్స్ ఎలాసాగుతూ ఉందో చెప్పి దేశానికి చాలా సేవ చేశారు. ఆయన మాటల ప్రకారం, ఆ ప్రాంతంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కలసి సంపాదన పంచుకుంటున్నారు. రామసుబ్బారెడ్డి వసూలు చేసే దాంట్లో మంత్రికి రుపాయకి అర్ధరుపాయ, మంత్రి వసూళ్లలో రామసుబ్బారెడ్డి రుపాయకి అర్ధరుపాయ వెళ్తుంది. ఇది ముఖ్యమంత్రి స్వయంగా ఫార్ములా… ఈ ఫార్ములా చెప్పి మంత్రి ఆదినారాయణ తన మనుషులకి గొడవలొద్దు అని భరోసా ఇచ్చారు. వీడియో చూడండి…మీకే  అర్థమవుతుంది. దీనికి వేరే అర్థాలేమయినా వుంటే… కామెంట్స్ లో పెట్టండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *