గుంతకల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆనంతపురం ఆర్ డివొ ఆఫీస్ ఎదురుగా గుంతకల్ రైల్వే జోన్ సాధన సమితి ఆద్వర్యం లో జరిగిన 48 గంటల దీక్షలు ముగిశాయి.
రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ రాజ శేఖర్ రెడ్డి అధ్యక్షతన దీక్షలు జరిగాయి.
వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, రైతు నాయకుడు బొజ్జా దశరధ రామి రెడ్డి, గేట్స్ ఎం.డి రఘునాథ రెడ్డి 48 గంటల దీక్షను విరమింపజేశారు.ఈ సందర్బంగా నాయకులూ మాట్లాడుతూ తక్షణం వెనకబడిన గుంతకల్ రైల్వే జోన్ గా ప్రకటించాలన్నారు లేని పక్షంలో రాయలసీమ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. కర్ణాటక కు జోన్ కేటాయించినపుడు రాజధాని బెంగుళూరును కాకుండా హుబ్లీకి కేటాయించారని అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందిన విశాఖపట్నం కాకుండా దేశంలోనే అత్యల్ప వర్షాపాతం ఉన్న అనంతపురం జిల్లాకు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు.
దీక్షలో రైల్వే జోన్ సాధన సమితి నాయకులూ రాజ శేఖర్ రెడ్డితో పాటు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి,అశోక్,సీమ కృష్ణ,రాజేంద్రప్రసాద్, శివ రాయల్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఈ దీక్షకు సంఘీబావంగా తదితరులు పాల్గొన్నారు. నేటి దీక్షా శిబిరానికి సిపిఎం రామ్ భూపాల్, వై
సిపి వెన్నపూస గోపాల్ రెడ్డి, నదీమ అహమ్మద్,చవ్వా రాజ శేఖర్ రెడ్డి, వైఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెరుమాళ్ళ జీవనంద రెడ్డి, వైసిపి జిల్లా కార్యదర్శి వై.సుభాష్ రెడ్డి,విద్యార్ధి సేన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బాసిద్,అనిల్ కుమార్, ఆర్ విపి ఎస్ అధ్యక్షుడు రవికుమార్,ఇంజనీరింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాగేస్వర్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట సత్యం ,ఒపిడిఆర్ రాంకుమార్, కేంద్ర యువ సాహిత్య పురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథ రెడ్డి,న్యాయవాదుల సంఘం హరినాథరెడ్డి,రిటైర్డ్ ఇంజనీర్ పాణ్యం సుబ్రహ్మణ్యం,గేట్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘునాథ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు