ఈ సాయంకాలం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన వైసిపి నేతల సమావేశం నెల్లూరు జిల్లాలో జరిగింది.
విభజన హామీలను తక్షణం అమలుచేయాలని కోరుతూ వైసిసి ఆందోళన ఉధృతం చేయాలని సమావేశం నిర్ణయించింది. సమావేశం వవరాలను ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
– మార్చి 1న అన్ని కలెక్టరేట్ల ముందు పార్టీ కార్యకర్తలు, సమన్వయకర్తలు అందరూ కలిసి ధర్నా చేయాలని నిర్ణయం.
– ప్రత్యేక హోదా మన హక్కు ప్యాకేజీతో మోసపోవద్దు అనే నినాదం.
– మార్చి 5న ప్రత్యేక హోదా మన హక్కు. ప్యాకేజీ మాకొద్దు..అంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ధర్నా.
– మార్చి 3న పార్టీ కీలక నేతలందరూ ఢిల్లీ వెళ్లటానికి వైయస్ జగన్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
– ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని, గత మూడేళ్లుగా వైయస్ జగన్ నాయకత్వంలో పోరాడుతుంది. గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ధర్నా చేయటం జరిగిందని, ఆ సందర్భంగా అరెస్ట్ కూడా అయ్యారు.
– అనేకసార్లు వైయస్ జగన్ ఆమరణ దీక్షలు చేశారు. యువభేరీ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక హోదా లాభాలను ప్రతి ఒక్కరికీ వివరించారు..
– ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ పిలుపుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లు నిర్వహించటం జరిగింది.
– ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోంది.
– ప్రజల దీనావస్థలు చూసి వారికి భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు.
– మార్చి 3న పార్టీ నేతలు అందరూ వైయస్ జగన్ కలుస్తారు.
– ప్రత్యేక హోదాతో మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
– ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక హోదా ముద్దు. వద్దని మరో రోజు. సంజీవని ఒక రో జు.. సంజీవనా అని మరో రోజు. ప్యాకేజీతో హోదా కన్నా ప్రయోజనాలు వచ్చాయని కల్లబొల్లి కబుర్లు చెబుతూ చంద్రబాబు ప్రజల్ని వంచిస్తున్నారు.
– ప్రత్యేక హోదాను సాధించే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని భూమన తెలిపారు.
– పోరాటం ఫలితాల కోసమే చేస్తాం. ప్రభుత్వం మీద ప్రభుత్వాలు చేస్తున్న మోసాల మీద తిరగబడటం ప్రజాస్వామ్య లక్షణం. పేద ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలన్న లక్ష్యం శ్రీ వైయస్ జగన్ గారికి ఉంది.
– ఎక్కడైతే శ్రీ వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా 15 సంవత్సరాలు హోదా ఇస్తామంటూ.. ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచారి.
– ఫలితం రానటువంటి పరిస్థితుల్లో పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైయస్ జగన్ స్పష్టం చేశారు.