గూగుల్ లో ‘కుట్ర’ అని సెర్చ్ చేస్తే కెటిఆర్ ఫోటో వస్తుంది

ఇదొక తమాషా. తెలంగాణ రాష్ట్ర సమితి ని తీవ్రంగా విమర్శించే  కాంగ్రెస్ అధికార ప్రతినిధి  డాక్టర్ శ్రవణ్ దాసోజు కంట పడింది. దానిని ఆయన తెలివిగా తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ మీద ప్రయోగించారు.

తమాషా ఎంటంటే, గూగుల్ సెర్చ్ లో ‘కుట్ర’అనే మాట సెర్చ్ చేస్తే  మొదట వచ్చే ఫోటోలు మంత్రి కెటిఆర్ వే.

‘‘రాజకీయ కుట్రలలో వయసుకు మించి మీరు(కేటీఆర్‌) ఆరి తేరారని, అందుకేనేమో ‘కుట్ర’ అని గూగుల్‌ ఇమేజెస్‌లో సెర్చ్‌ చేస్తే, మీ ఫోటోలు కుట్ర అనే పదానికి పర్యాయపదంగా ఉన్నట్లుంది,’’ అని  దాసోజు వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన  కేటీఆర్‌కు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాస్తూ ఈ విషయం గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధాని పదవిని వద్దనుకుంటే.. మీరేమో ఇంటిల్లిపాదీ పదవులు అనుభవిస్తున్నారు అని  కేసీఆర్‌ కుటుంబాన్నిఉద్దేశించి ప్రస్తావించారు. దాసోజు కెటిఆర్ మీద వేసిని మరిన్ని పదునైన బాణాలు:

 

**మీ కుటుంబానికి రాహుల్ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది విమర్శించారు.

**మోదీ తెలంగాణ బిల్లుపై విచ్చలవిడిగా మాట్లాడుతుంటే విమర్శించాల్సింది పోయి మెప్పుకోలు కోసం పాకులాడుతున్నారు.

**పార్లమెంటులో తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని ప్రధాని మోదీ తూలనాడుతుంటే టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు.

ఎయిమ్స్, పోలవరం ముంపు, రైల్వే జోన్ ఇలా వేటికి బడ్జెట్ లో నిధులు ఇవ్వకున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు.

**మోదీతో ఉన్న లోపాయికరి ఒప్పందం ఏంటో చెప్పాలి.

**మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కేటీఆర్‌ తాకట్టు పెట్టారు.

**మోదీతో లోపాయికారి ఒప్పందంపై గన్ పార్క్ వద్ద చర్చకు రావాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *