విభజన తర్వాత కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని, ఖర్చు చేసిన నిధులెన్ని, ఇంకా ఎంత స హాయం అందాలి, విభజన హామీ లేమయ్యాయి వంటి విషయాలను రాజకీయాలకు అతీతంగా అధ్యయనం చేసేందుకు ఓక కమిటీ వేస్తున్నట్లు జనసేన నేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఇందులో మాజీ రాజమండ్రి ఎంపి వుండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా సంస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ వంటి వారుంటారని ఆయన చెప్పారు. ఈ కమిటిలో ఆర్థిక వేత్తలు, విద్యావంతులుఉంటారని చెబుతు కేంద్ర, రాష్ట్రాలు నిధుల మీద వివరాలు సమర్పిస్తే నిగ్గు తేల్చి ప్రజల ముందు పెడుతుందని ఆయన చెప్పారు.
ఈ రోజు మధ్యాహ్నం పవన్ కల్యాణ్ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
‘నిధుల గురించి అలోచిస్తున్నపుడు, పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాలనుంచి నిష్క్రమిం చిన ఉండవల్లి గుర్తొచ్చారు. ఈ రోజే కలిశాను. విభజన గురించి ఆయన న్యూట్రల్ గా చూడగలడు.అలాగే జయప్రకాశ్ నారాయణ్. ఇలాంటి వ్యక్తులతో కలసి ముందుకు పోవాలనుకుంటున్నాను. నాకు కొంతమంది ఎకానమిస్టులు, పాలసీ మేకర్స్,అకడమిషియన్స్ తెలుసు. వీరందరిని కలిపాలనుకుంటున్నాను. కొందరు ఆమోదం తెలిపారు. రెండు మూడురోజులలో ఎందరు ముందుకు వస్తారో తెలుస్తుంది,’ అని పవన్ అన్నారు.
‘ప్రభుత్వానికి విజ్ఞప్తి… కేంద్రంనుంచి ఎన్నినిధులొచ్చాయో నాకు చెప్పండి. ఇలాగే బిజెపి హరిబాబును అడుగుతున్నాను. కేంద్రం నుంచి ఎన్నినిధులొచ్చాయో వివరాలు ఇవ్వండి.రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధుల మీద ఒక శ్వేత పత్రం ఇస్తే, దానిని కమిటీకి పంపిస్తాను. కమిటి విశ్లేషిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, బిజెపి సహకరించాలి.’
సమావేశంలో ఉండవల్లి మాట్లాడిన విషయాలు:
పవన్ కలసి పనిచేసుందుకు ఇష్టపడేందుకు కారణం, ఆయన రాజకీయాలు మాట్లాడక పోవడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరు అబద్ధాలాడుతున్నారు? కేంద్రం నిధులిచ్చామని చెబుతూ ఉంది. రాష్ట్రం రాలేదంటూఉంది. పవన్ లేవనెత్తిన సమస్య వల్ల ఆయనతో కలసి పనిచేయాలనుకుంటున్నా. రాజకీయాలనుంచి విరమించుకుకోవాలనుకుంటున్నపుడు పవన్ నన్ను కలపుకుని ముందుకు పోవాలనుకుంటున్నాను.
పవన్ వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడింది. పవన్ అడిగిన విషయాలను ప్రభుత్వం అందిస్తుందని నమ్ముతున్నా. ఎందుకంటే, ఈ ప్రభుత్వానికి ఆయన మద్ధతు ఉంది. అందువల్ల బిజెపి, టిడిపి ప్రభుత్వాలు ఆయనకు సహకరించాలి. ఈ రెండు ప్రభుత్వాలు అందించే సమాచారంతో ఆయన వేస్తున్న కమిటి వాస్తవంగా విశ్లేషిస్తున్నదన్న నమ్మకం ఉంది.
పవన్ ఏదైనా చెబితె కోటి మందికి వెళ్తుంది. ఆయన ఇంతవరకు ప్రశ్నించింది వేరు, ఇపుడు చేస్తున్నది వేరు. ఇవి పవన్ పాలిటిక్స్ కాదు. ప్రజలకు సంబంధించినవి.
ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ తాను కోరిన సమాచారాన్ని ఈ నెల 15 వ తేదీ లోపు ఇవ్వాలనికోరుతున్నానని పవన్ అన్నారు.