జనసేన నేత పవన్ కల్యాణ్ ప్రారంభించ తలపెట్టిన జాయింట్ యాక్షన్ కమిటి (ఎపి జెఎసి)కి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడతూ జెఎసి విషయంలో పవన్ సహకరిస్తామని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు పార్టీలకు అతీతంగా పోరాడదామని రఘువీరా పిలుపు నిచ్చారు. రండీ, ఏపీ ఆత్మగౌరవాన్ని పోరాడదామని అన్ని పార్టీలకు పిలుపు నిస్తూ 15 వరకు అన్ని మమడలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరగుతుందని ఆయన చెప్పారు.ఫిబ్రవరి 20 నుండి 28 అన్ని రెవిన్యూ డివిజన్ కార్యాలయాల ముందు దీక్ష ఉంటుందని రఘవీరా చెప్పారు.మార్చి 2వ తేదీన జాతీయ రహదారుల దిగ్భంధం ఉంటుందని చెబుతూ పవన్ కళ్యాణ్ జేఏసీకి సహకరిస్తామని ఆయన చెప్పారు.
‘‘నాలుగేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ ఎపీకి న్యాయం చేయాలని చట్టం చేసింది. రాష్ట్ర విభజనలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బదింది.బిజెపి ఏపీకి న్యాయం చేస్తామని చేప్పి అన్యాయం చేసింది.నాలుగేళ్ళో ఏపీకి ఇచ్చిన నిధులు చాలా తక్కువ,’’ అని ఆయన అన్నారు.
రాజధాని, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్, ఉక్కు పరిశ్రమ, పెట్రో కెమికల్, దుగ్గిరాజపట్మం పోర్ట్, మెట్రో ప్రాజెక్టులు ఇలా ఏ హామీ నెరవెర్చకుండా బిజెపి మోసం చేసిందని ఆయన విమర్శించారు.
ప్రత్యేక హోదా, ఆంధ్రు హక్కు అనే నినాదం ప్రజల్లో ప్రతిధ్వనించాలని,
ఏపీ కోసం బిజెపి మినహా పార్లమెంట్లో అన్ని పార్టీలు ఏపీ కోసం పోరాటం చేయడం సంతోషదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాహస్య ఎజెండాలు మానుకోవాలని ఆయన సూచించారు.సోనియా, రాహుల్ ని టిడిపి ఎంపీలు కలిసి ఏపీ సమస్యను వివరించిన విషయం చెబుతూ అందుకే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా, పోలవరంపై పోరాటం కోసం రాహుల్ పిలుపిచ్చారు. తమ పోరాటంలో భాగంగా మార్చి 6,7,8 తేదీలో ఛలో పార్లమెంటు తో ఢిల్లి వెళుతున్నట్లు ఆయన చెప్పారు. మార్చి 5 నుంచి మొదలయ్యే పార్లమెంటు సెషన్స్ లోనే ఎపీకి న్యాయం జరగాలి లేదంటే ఇక ఏపీకి న్యాయం జరగదని కూడా ఆయన అన్నారు.రాష్ట్ర అభివృద్ధి కి ఎవరితో అయిన కలిసి పని చేస్తాం.