కెటిఆర్, హరీష్ ఈ పాటికి తన్నుకునే వాళ్లే…(వీడియో)

అధికార టీఆర్ఎస్‌ పార్టీ గురించి కాంగ్రెస్ నల్లగొండ ఎమ్మెల్యే చాలా అసక్తి కరమయిన విషయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి కుమారుడు కెటియార్ మేనల్లుడు హరీష్ రావు మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో ఆయన ఈ రోజు బయటపెట్టారు. ఏదో కెసిఆర్ ఉండబట్టి సరిపోయి, లేకుంటే ఇద్దరు రోడ్డెక్కి కాట్లాడుకునేవారని ఆయన మీడియాతో అన్నారు.

టిఆర్ ఎస్ నాలుగు వోట్లు పడుతున్నాయంటే అది కేవలం కష్టజీవి హరీష్ రావు గురించేననని కూడ అన్నారు. పార్టీలో కష్టపడుతున్నది కూడా హరీష్ రావే నని అన్నారు. కోమటి రెడ్డి వెల్లడించిన ఆసక్తికరమయిన విషయమేమిటంటే, హరీష్ ఇంట్లో ఒక ముఖ్య మయన ఫంక్షన్ ఉంటే కేటీఆర్ కావాలనే ఎగ్గొటారని అన్నారు. పంక్షన్ కు వెళ్లకుండా ఉండేందుకు  కెటీయార్ బెంగుళూరు చెక్కేసి  సినిమా చూసొచ్చాడని కోమటిరెట్టిచెప్పారు. ‘‘సీఎం కేసీఆర్ లేకపోతే బావా, బావమరుదులు (హరీశ్ రావు, కేటీఆర్) రోడెక్కి కొట్టుకునే పరిస్థితి వచ్చి ఉండేది,’ అని అన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డి గురించి మాట్లాడుతూ  ఆరు నెలల తర్వాత  అడ్రస్ గల్లంతయ్యే మినిస్టర్  జగదీష్ రెడ్డి అన్నారు. ‘ నువ్వు మళ్లీ చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందే,’ అని సీరియస్ కామెంట్ చేశారు. కోమిటిరెడ్డి ఇంకా ఏమన్నారో చూడండి…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *