హైదరాబాద్ గాంధీభవన్ లో ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగనున్న నిరుద్యోగ చైతన్య యాత్ర ను పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఐసిసి తెలంగాణ ఇన్ చార్జ్ రామచంద్ర కుంతియా , పిసిసి వర్కింగ్ ప్రెశిడెంట్ భట్టి విక్రమార్క ,అనిల్ యాదవ్ ,పొన్నం ,పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 49రోజుల్లో అన్ని నియోజకవర్గా లలో ఈ యాత్ర కొనసాగుతుందని ఉత్తమ్ చెప్పారు. ఉత్తమ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు…
**నిరుద్యుగుల్లో ఈ యాత్ర ద్వారా చైతన్యం తెస్తాం ..ప్రభుత్వ తీరును యువతకు వివరిస్తాం
**ఖాళీలుగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను కేసీఆర్ ఎందుకు భర్తీచేయడలేదో యువతకు వివరిస్తాం.
**4ఏళ్ళల్లో పది శాతం ఉద్యోగాల కూడా భర్తీ చేయలేదు.
**ఒక్క డిఎస్సిని ఎందుకు నిర్వహించలేదో కేసీఆర్ చెప్పాలి
**కేటీఆర్ సూటుబూటు తో విహార యాత్రలు చేస్తున్నారు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
**వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తాం
**కేసీఆర్ లా ఒట్టి మాటలు చెప్పం