ఒకనాడు బౌద్దమతానికి ఆలంబనగా, ముఖ్య కేంద్రంగా విరాజిల్లిన రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక బౌద్ధాలయం నిర్బించేందుకు ధాయ్ లాండ్ ముందుకు వచ్చింది.
థాయ్‌ల్యాండ్ బృందమొకటి ఈ రోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుంది.
ధాయ్ లాండ్ నిర్ణయానికి స్పందిస్తూ అమరావతిలో పది ఎకరాల స్థలం కేటాయిస్తామని, ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, ఆకృతులతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఏపీ నుంచి ధాయ్ ఎయిర్వేస్ సేవలు నడిపేందుకు కూడా ధాయ్ లాండ్ బృందం సంసిద్ధత తెలిపింద.
విశాఖ లేదా విజయవాడ నుంచి త్వరలో సేవలు ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ధాయ్ ప్రతినిధులు తెలిపారు.
అయితేచ, విజయవాడ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు.
నాగార్జున విశ్వవిద్యాలయంలోని బుద్దిస్టు లెర్నింగ్ సెంటర్‌కు అనుసంధానంగా ఉంటూ బౌద్ధ ధర్మం, విశిష్ఠతలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకు రావాలని భావిస్తున్నట్టు బృందానికి నాయకత్వం వహించిన థాయ్‌ల్యాండ్ కాన్సల్ జనరల్ కాంగ్ కనీత్ రక్చోరియన్ తెలిపారు.