తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
నిన్న ఇద్దరు హైదరాబాద్ జర్నలిస్టులు ప్రాణాపాయపరిస్థితిని ఎదుర్కొన్నారు. సాటి జర్నలిస్టులు వెంటనే రంగంలోకి దిగి వారి పరిస్థితిని నలుగురికి తెలియచేయడంతో ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
అనేక మంది సకాలంలో ముందుకు రావడంతో ప్రస్తుతానికి ఇద్దరు ఆసుపత్రిలో చేరగలిగారు. చికిత్స తీసుకుంటున్నారు.
ఈ లోపు ఆంధప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు తక్షణం సాయం అందించేందుకు సమాచార శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించింది. ఒక సారి కోవిడ్ లక్షణాలు కనబడిన ఈ నోడల్ అధికారులకు ఫోన్ చేస్తే వారే పరీక్షలు నిర్వహించి, అవసరమయితే ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స ఇప్పించే, వైద్యాన్ని పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటుచేస్తున్నది. ఇది శనివారం నుంచి అమలులోకి వస్తుంది.
దీనిని ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ స్వాగతించింది.
శుక్రవారం ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి, అనేక మంది జర్నలిస్టుల మరణాలు, వైద్యం కోసం జర్నలిస్టుల పడుతున్న తీవ్ర ఇబ్బందులను వివరించటం జరిగింది.
ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ బృందం విజ్ఞప్తి మేరకు కొద్ది సేపట్లో ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను జర్నలిస్టుల కోసం అందుబాటులో ఉంచుతామని వైద్యశాఖ ఉన్నతాధికారులకు శుక్రవారం ప్రకటించారు.
వైద్యారోగ్య శాఖ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 8639710241
లక్షణాలున్న జర్నలిస్టులు తమ వివరాలను అందులో అప్‌లోడ్ చేసే పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్ల కేటాయింపు చేసేందుకు ప్రత్యేక టీంను అందుబాటులోకి తెస్తామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు తెలిపారు.
అదే విధంగా జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వాక్సినేషన్ కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రెస్ క్లబ్ కోశాధికారి సూరజ్ వి భరద్వాజ్ తెలిపారు.
వాట్సాప్ నంబర్ నుంచి
-Online Doctor Counselling
-Home Isolation
-Provision of Medical Kits
-Hospital Admissions &
-Other Emergency Issues. లకు సంబంధిన సాయం కోరవచ్చని సూరజ్ తెలిపారు.