అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగ ప్రమోట్ చేసిన హైడ్రాక్సీ క్లోరీ క్వి న్ గోళీ లేసుకుంటేప్రాణానికి ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
కోవిడ్ -19 చికిత్సకోసమని ఈ గోలీలు ట్రంప్ వాడుతున్నాడని ఎవరంతకు వాళ్లు మింగటం సురక్షిత కాదని ఈ విషయం తాజా పరీక్షల్లో వెల్లడయిందని చెబుతూ ఈ గోలిల వినియోగం మీద WHO నిషేధం విధించింది.
ఈ మందు మీద జరుగుతున్న ట్రయల్స్ ను కూడా ఆపేయాలని ఈ సంస్థ అనేక దేశాలకు సూచించింది. కోవిడ్ -19 తో బాధపడే రోగుల్లో ఈ మందు వాడటం వల్ల ప్రాణాపాయం ఉందని ఒక భారీ పరిశోధన వెల్లడించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ చర్య తీసుకుంది.
నిజానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది మలేరియా మందు. కోవిడ్ విజృంభించడంతో అందుబాటులో ఉన్నఅనేక మందులను కరోనా కు వ్యతిరేకంగా సిఫార్సు చేయడం మొదలు పెట్టారు. ఇందులో ఏదో ఒకటి కోవిడ్ కు కూడా పనిచేస్తుందన్న విశ్వాసంతో అన్నింటిని ప్రయోగించడం మొదలుపెట్టారు. ఇలా ప్రయోగాత్మకంగా వాడిన మందులో హైడ్రాక్సిక్లోరో క్విన్ ఒకటి.
అయితే, ట్రంపు ఈ మందును విపరీతంగా ప్రశంసించడంతో హైడ్రాక్సీ క్లోరో క్విన్ కు సెలెబ్రిటీ హోదా వచ్చింది. అంతేకాదు, ఈ మాత్రలను వైరస్ తన దగ్గిరకురాకుండా ఉండేందుకు తాను వాడుతున్నానని కూడా బుకాయించి మరీ పాపులర్ చేశారాయన. విలేకరులతో మాట్లాడుతూ తాను ఈ మందు వాడుతున్న విషయాన్ని వెల్లడించారు. ఈ మందు కోవిడ్ రోగులకు వాడితే హృదయంసంబంధ సమస్యలొస్తాయని చెప్పినా ట్రంప్ మహానాయకుడు ఈ మందు ప్రమోషన్ మానలేదు.
https://trendingtelugunews.com/telugu/breaking/fomer-congress-mla-challa-vamsi-chand-reddy-asks-kcr-16-questions-on-south-telangana/
హైడ్రాక్సి క్లోరో క్విన్ ను వాడినందును కోవిడ్ రోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని గత వారం ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్’ (The Lancet) ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. కోవిడ్ ను నయం చేయడం కాదు, ఈ మందుకోవిడ్ తో ఆసుపత్రి చేరిన రోగుల్లో ఇది ప్రాణాపాయం కల్గిస్తుందని ఈ పరిశోధనా పత్రం వెల్లడించింది.
ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే, మీ మిత్రులకు షేర్ చేయండి!
మలేరియాకు హైడ్రాక్సీ క్లోరో క్వినైన్ ను సురక్సితంగా వాడవచ్చు. అదే విధంగాకీళ్ల నొప్పులకు కూడా వాడవచ్చు.అయితే, ఇది కోవిడ్-19 కు పనిచేస్తుందని ఎక్కడా ట్రయ్సల్స్ లో వెల్లడి కాలేదు.
ఈ మధ్య కాలంలో చాలా మంది రోగులు హైడ్రాక్సీ క్లోరో క్వి న్ సొంతంగా వాడటం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి వచ్చింది.దీనితో కోవిడ్ ట్రయల్స్ నుంచి హైడ్రాక్సిక్లోరో క్విన్ ను తొలగిస్తున్నట్లు సోమవారం నాడు ఈ సంస్థ ప్రకటించింది. ది లాన్సెట్ స్టడీలో 96,000 మంది రోగులను పరిశీలించారు.
వీరిలో 15,000 వేల మందికి ఒక్కటిగాగాని, ఇతర యాంటిబయాటిక్స్ తో కలిపిగా హైడ్రాక్సీ క్లోరో క్వినైన్ ను ఇవ్వడం జరిగింది. ఇతర కోవిడ్ పేషంట్ల కంటే, హైడ్రాక్సీ క్లోరైడ్ తీసుకున్న పేషంట్లు చనిపోయే అవకాశం ఎక్కువగా కనిపించింది. కారణం, ఈమందువల్ల ఈరోగులలో హార్ట్ రిథమ్ లో సమస్యలొచ్చాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్నవారిలో 18 శాతం ఉంటే,కంట్రోల్ గ్రూప్ లో 9శాతం మరణాలుకనిపించాయి.
ఇక వట్టి క్లోరో క్విన్ తీసుకువారిలో మరణాలశాతం16.4 శాతం దాకా ఉంది. ఇదే ఇతర యాంటిబయాటిక్స్ తో కలిపి హైడ్రాక్సిక్లోరో క్విన్ తీసుకున్న వారిల్ మరణాలు సంఖ్య ఇంకా ఎక్కుకవగా ఉన్నట్లు ది లాన్సెట్ అధ్యయనం చెబుతూ ఉంది.
“We were unable to confirm a benefit of Hydroxychloroquine or chloroquine, when used alone or with a macrolide, on in-hospital for COVID-19. Each of these drug regimens was associated with decreased in-hospital survival and an increased frequency of ventricular arrhythmias when used for the treatment of COVID-19,” అని ఈ అధ్యయనం జరిపినశాస్త్రవేత్తలు ‘ ది లాన్సెట్’ లోరాశారు. ఈ అధ్యయనంలో డాక్టర్ డాక్టర్ మణిదీప్ ఆర్ మెహ్రా,, సపన్ ఎస్ దేశాయ్, ప్రొఫెసర్ ఫ్రాక్ రుష్కిత్ జ్కా, అమిత్ ఎన్ పటేల్ లు పాల్గొన్నారు.
Hydroxychloroquine or Chloroquine with or without a macrolide for treatment of COVID-19: a multicultural analysis అనే శీర్షికతో ఈ అధ్యయనం The Lancet లో అచ్చయింది.