తొలగించాక రాజీనామా చేసిన రవి ప్రకాష్

రవి ప్రకాష్ ను టీవీ9 సీఈవో గా తొలగించిన తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖ పంపారు. లేఖ కింద ఉంది చదవొచ్చు.
10 మే 2019
సాయంత్రం 6 గంటలు
TO
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్,
అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎబిసిఎల్),
97, రోడ్ నెం: 3, బంజారాహిల్స్,
హైదరాబాద్ 500034
విషయం : tv9 గ్రూప్ ఛానల్స్ సిఈఓ పదవి నుంచి రాజీనామా. తప్పుడు కేసులు బనాయించడం, యాజమాన్యాన్ని వేధించడంపై నిరసన.
వెనుకదారిలో అక్రమంగా ప్రవేశించిన బోర్డు సభ్యులకు,
నేను.. రవిప్రకాష్.. tv9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను.
మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే tv9 పని పట్టాని ఈ చర్యలకు దిగారు.
అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో tv9 సంస్థలోకి జొరబడ్డారు.
ఎన్ సిఎల్ టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు.
ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో tv9 ని కంట్రోల్ లోకి తీసుకున్నారు.
తప్పుడు కంప్లయింట్స్ తో, తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు.
పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు.
నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు.
మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్ గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను.
దేశంలో జర్నలిజాన్ని కాపాడడానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్నినిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది.
– రవిప్రకాష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *