మినీ డేరాబాబా.. పార్ట్ 3
తెలంగాణలో మినీ డేరా బాబా గా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన రమణ నంద మహర్షి గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాదాద్రి జిల్లాలో మినీ డేరాబాబా అవతారమెత్తిన రమణనంద మహర్షి బాగోతం మీద ట్రెండింగ్ తెలుగు న్యూస్ లో ఇప్పటికే రెండు కథనాలు ప్రచురించాము. ఇంతకూ తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో సెటిలైన రమణానంద సొంతూరు ఎక్కడ? ఆయన కుటుంబ వ్యవహారాలేంటి? సోడాల వెంకట రమణ రమణనంద మహర్షి ఎట్లా అయిండో పూర్తి వివరాలు చదవండి.
సిద్ధగురు రమణ నంద మహర్షి అలియాస్ రమణ అలియాస్ వెంకట రమణ అలియాస్ సోడాల వెంకట రమణ.. ఏంటీ ఈ పేర్లు అనుకుంటున్నారా.. మరేం లేదండీ మన సిద్ధ యోగి అసలు పేర్లు ఇవి. సందర్భాన్నిబట్టి పేర్లు మారిపోతాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలో కపట్రాళ్ల ప్రాంతానికి చెందిన వాడే మన మహర్షి రమణ మహర్షి. కపట్రాళ్ల అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చే పేరు వెంకటప్ప నాయుడు. కపట్రాళ్ల వెంకటప్ప నాయుడు రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా ఉమ్మడి రాష్ట్రంలో సుపరిచితమే. ఫ్యాక్షన్ లో పుట్టి ఫ్యక్షన్ లో పెరిగి తుదకు ఫ్యాక్షన్ లోనే అంతమైన చరిత్ర కపట్రాళ్ల వెంకటప్పనాయుడిది.
సరే వెంకటప్పనాయుడి సంగతి అలా ఉంచితే.. మన రమణ నంద మహర్షి తల్లి తండ్రికి ఏడుగురు సంతానం. రమణ నందకు నలుగురు అన్నలు, ఇద్దరు అక్కలు. రమణ అందరి కన్నా చిన్న వాడు. ఇంజనీరింగ్ చదివాడు. ప్రస్తుతం రమణ సోదరుడు అదే కపట్రాళ్ల గ్రామంలో చిన్న కిరాణం దుక్నం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విశాఖపట్నంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రమణ ఇంజనీరు కావాల్సిందిపోయి వెంకట రమణ సిద్ధయోగిగా, మహర్షి సిద్ధ గురు రమణా నంద మహర్షి గా అవతారమెత్తాడు. అలా ఎందుకు మహర్షి అవతారమెత్తాడంటే..?? ఇంజనీరు అయితే వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన దీనిలో ఉందని గుర్తించాడు. అప్పుడే బాబా కి జ్ఞానోదయం అయ్యింది. అందుకే మినీ డేరాబాబా 2వ భాగం లో చెప్పినట్టు సాయి బాబా ని తన బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకొని విశాఖపట్నం నుండి నేరుగా షిరిడి వెళ్లి సాయి బాబా పై రీసెర్చ్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత సోడాల వెంకట రమణ కాస్త సిద్ధ గురువుగా ప్రవచనాలతో ప్రజల ముందుకు వచ్చారు.
సిద్ధ యోగి అంటే సిద్ధిని కలిగిన యోగి అని అర్ధం కాని ఈ సోడాల వెంకట రమణ పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళతో కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇప్పిస్తున్న గొప్ప సాధువు. పైగా కాషాయ వస్త్రాలు ధరిస్తేనే యోగి అంటారా? మోడ్రన్ దుస్తులు, విదేశీ వస్త్రాలు ధరిస్తే యోగి కాదా అని రమణ మనుషులు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. బాబాలు బనియన్, నెక్కర్ తో కూడా దర్శనమివ్వొచని కొత్త ట్రెండ్ సెట్ చేశారు మన రమణనంద మహర్షి.
సాయి ప్రవచనాలతో ప్రారంభం అయిన వెంకట రమణ శక్తి పాతం, భక్తి సభలు, లింగ ప్రతిష్ట, దర్శనం, కానుకలు, హోమాల పేరుతో ప్రజల సోమ్మును వీలైనంతగా లాగుతున్నారు. నిత్యం కాంట్రవర్సీ లతో ప్రజల మధ్య ఉంటూ ఇప్పుడు ఏకంగా అమెరికాలో పాగా వేసిన ఘనుడు ఈ సోడాల వెంకట రమణ అలియాస్ రమణ నంద మహర్షి. ఈ సిద్ధ యోగి బాగోతాల గురించి కర్నూలు జిల్లాలోని కపట్రాళ్లలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి దొంగ బాబాలను జనాలు నమ్మడం ఆపనంత వరకు నిత్యా నంద లు డేరా బాబాలు రమణ నంద మహర్షులు@ సోడాల వెంకట రమణలు ఇలా స్వామిజీల రూపంలో మహర్షిల రూపంలో మోసం చేస్తూనే ఉంటారు.
* రచయిత : కోసిక వినయ్ కుమార్, జర్నలిస్ట్, యాదాద్రి జిల్లా.
మినీ డేరాబాబా పార్ట్ 1, 2 స్టోరీల కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
https://trendingtelugunews.com/mini-dera-baba-story-part-2/