తెలంగాణ సిఎం కేసిఆర్ మొక్కులు తీర్చుకునేందుకు గురువారం విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన తన కుటుంబసభ్యులు, పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టులో దిగారు.
సిఎం కేసిఆర్ బృందానికి ఎపి మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు స్వాగతం పలికారు. అనంతరం కేసిఆర్ ఇంద్రకీలాద్రి గుట్టమీదకు చేరుకుని అమ్మవారికి ముక్కుపుడక మొక్కు చెల్లించుకున్నారు. కేసిఆర్ విజయవాడలో దిగిన సందర్భంలో వీడియోలు చూడండి.