వైఎస్సార్ రాయలసీమ బాటలో జగన్ నడవాలి : మాకిరెడ్డి

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం అనేమాట నిత్యం ఇంటూ ఉంటాము. రాజకీయాలలో మరీ ఎక్కువ. చరిత్రలో చిరస్థాయిగా నిలవడం భావితరాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే సాద్యం. రాయలసీమ చరిత్రలో వై యస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్థానం చిరస్మరణీయం. అందుకు కారణం వారు చేసిన చారిత్రక నిర్ణయాలే.
రాయలసీమ ప్రజలలో నిర్వేదంతో వినిపించే మాట మరికొంత కాలం ఆంగ్లేయులు ఉండి ఉంటే ? రాయలసీమకు నీటి కష్టాలు ఉండేవా ! స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తి అయినా సీమలో ఆంగ్లేయులు నిర్మించిన కేసి కెనాల్ మినహా ఒక లక్ష్య ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టును మన పాలకులు నిర్మించలేదు. అంతేకాదు నాడు సీమలో నెలకొన్న కరువు పరిస్థితులును చూసీ చలించి శాశ్వత ప్రాతిపదికన సీమ నీటి సమస్య పరిష్కారానికి కృష్ణా పెన్నారు ప్రాజెక్టును రూపొందించినారు. నేటికీ రాయలసీమలో సిద్దేశ్వరం కావాలనే నినాదం వినిపిస్తోంది. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టాలి అన్న నినాదం మొదటి వినిపించిన రాయలసీమలో నిర్వేదంతో అనే మాట వారు మరికొంత కాలం ఉండి ఉంటే కృష్ణా పెన్నారు నిర్మాణం జరిగి ఉండేది. రాయలసీమకు నేటి కరువు ఉండేది కాదు కధా అని. ప్రజల బాగు కోసం కీలక నిర్ణయాలు తీసుకునే వారికి చరిత్రలో లభించే స్తానం అది.
వై యస్ నిర్ణయాలే సీమ నీటి సమస్య పరిష్కార్గం
రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం ఆంగ్లేయుల తర్వాత మనసు పెట్టిన వారు రామారావు గారు అయితే ఆంగ్లేయుల ఊహకు కార్యరూపం ఇచ్చింది మాత్రం నిస్సందేహంగా వై యస్ అని చెప్పక తప్పదు.
మొదట రూపొందించిన కృష్ణా పెన్నారు స్థానంలో నాగార్జున సాగర్ నిర్మాణం కావడం సీమలో నిర్మించిన శ్రీశైలం రాయలసీమకు ఉపయోగపడకపోవడంతో ఏటా 1000 టీఎంసీల నీరు ప్రవహిస్తున్నా వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నా త్రాగడానికి నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి రాయలసీమది. అలాంటి సమయంలో రూపుదిద్దుకున్నదే మలిదశ రాయలసీమ ఉద్యమం.
అందులో పాల్గొన్న కీలక నేతలలో వై యస్ ఒకరు. కేవలం చెన్నై నగరానికి నీటి సరఫరా చేసేందుకు మాత్రమే ఉద్దేశించిన ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా సీమ ఉద్యమం జరిగింది. రాయలసీమకు నీరు ఇవ్వకుండా పోతిరెడ్డిపాడు నుంచి ఎలా నీరు తీసుకుని పోతారో చూస్తామంటూ నడిచిన సీమ ఉద్యమ ఫలితమే నేటి సీమ ప్రాజెక్టుల రూపకల్పన.
పోతిరెడ్డిపాడు వెడల్పు  సాహసోపేత నిర్ణయం
రాయలసీమ నీటి ప్రాజెక్టులకు నీరు విడుదల పోతిరెడ్డిపాడు ద్వారానే. సీమ ప్రాజెక్టులకు నికరజలాలు లేకపోవడం. శ్రీశైలం బ్యాక్ వాటర్ తోనే నీటిని సరఫరా చేసే అవకాశం ఉండటంతో బాటు కనీస నీటిమట్టం అవకాశం లేకుండా జీఓ 69 అమలులో ఉండటం వల్ల రాయలసీమకు వరదలు వచ్చినపుడు కూడా నీటిని వాడుకోలేని దుస్థితి.
రాయలసీమ ఉద్యమ డిమాండ్లలో కీలకమైనది పోతిరెడ్డిపాడు వెడల్పు పెంపు. ఎన్ టి రామారావు  పోతిరెడ్డిపాడు సామర్థ్యం 1.50 లక్షల క్యూసెక్కులుగా పెంపుదలకు జీఓ ఇచ్చినారు. అపుడు మాత్రమే రోజుకు 12.5 టీఎంసీల నీటిని డ్రా చేయవచ్చు.
నిన్న వచ్చిన వరద ప్రవాహం 15 రోజులు ఉన్నది. పై ఎసులుబాటు ఉంటే 200 టీఎంసీల నీటిని రాయలసీమ , నెల్లూరు జిల్లాలలో నిల్వ చేసుకుని ఉండే అవకాశం ఉండేది. వై యస్ అధికారంలోకి వచ్చే వరకు నీటి ప్రాజెక్టుల గురించి చర్చ మినహా వాటికి నీరు అందించే పోతిరెడ్డిపాడు గురించి అసలు చర్చే లేదు.
*మారుతి కార్ల ఉత్పత్తి  34 శాతం కట్
పుండు మీద కారం కొట్టి నట్లు శ్రీశైలం ఎత్తు మట్టం 834 జీఓ రావటంతో సీమ ప్రాజెక్టులకు నీటి సరఫరా మరింత జఠిలంగా మారింది.
2004 లో అధికారంలోకి వచ్చిన వై యస్ తాను రాయలసీమ ఉద్యమ సమయంలో ఏ డిమాండ్ చేసినారు వాటి పరిస్కారానికి నడుం బిగించారు. తొలి చర్యగా శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు పెంచడం , 12 వేల క్యూసెక్కులగా ఉన్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
నేడు రాయలసీమ గురించి మొసలి కన్నీరు కారుస్తున్న అమరావతి పెద్దలు , రాజకీయ కారణంగా తెలంగాణ నేతలు వై యస్ ప్రయత్నాలను తీవ్రంగా అడ్డుకున్నారు. శ్రీశైలం ఎత్తుమట్టం పెంచడం సాద్యం కాకపోయినా పోతిరెడ్డిపాడు వెడల్పు మాత్రం పూర్తి చేయగలిగినారు. దాని పలితం రోజుకు 4 టీఎంసీల నీటిని డ్రా చేసుకునే అవకాశం ఏర్పడింది.
తెలంగాణ , అమరావతి పెద్దల నుంచి వస్తున్న ఆటంకాలను దృష్టిలో పెట్టుకొని దుమ్ముగూడెం – సాగర్ టెల్ పాండు మరియు పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి శ్రీశైలం నీటిని సాగర్ జలాశయంకు విడుదల చేయాల్సిన అవసరం లేకుండా వాటిని పూర్తిగా రాయలసీమ , నెల్లూరు , ప్రకాశంలోని వెలుగొండతొ బాటు వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి నీరు ఇచ్చే ప్రణాళికలు రూపొందించి అమలుకు పూనుకున్నారు.
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్, ఇంతకీ ఎవరీమె?
బహుశా వారు ప్రమాదంలో మరణించకుండా ఉండి ఉంటే వారి కాలంలోనే పై ప్రణాళికలు పూర్తి చేసుకుని రాయలసీమ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం జరిగి ఉండేది.
రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి దూరద్రుష్టితో నిర్ణయాలు తీసుకోవడం , తాను అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలకు వేరవకుండా పోతిరెడ్డిపాడు వెడల్పు పెంచడం , శంకుస్థాపనకే పరిమితం అయిన గాలేరు – నగరి , హంద్రీనీవాను పూర్తి చేయడానికి నిధులు మంజూరు మరియు కుందు , తుంగభద్ర నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం రాయలసీమ అభివృద్ధికి చారిత్రక నిర్ణయాలుగా మారాయి.
దాని ఫలితమే వై యస్ రాజశేఖర్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినారు. తండ్రి రాజకీయ వారుసిడిగా అధికారంలోకి వచ్చిన వై యస్ జగన్ మోహన్ రెడ్డి మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసి రాయలసీమకు న్యాయం చేయాలని సీమ సమాజం ఎదురుచూస్తుంది.
-పురుషోత్తమ రెడ్డి, సమన్వయకర్త, రాయలసీమ మేధావుల  ఫోరమ్