ఇక డిగ్రీ ఒక్కటే చాలదు…చాలా ఉండాలి… ఆవేమిటో తెలుసా?

(సలీమ్ బాష)
ఈ రోజు (15.7.19) వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా ఈ వ్యాసం ప్రత్యేకం. ఇక నుంచి స్కిల్ డెవెలప్ మెంట్  మీద ప్రముఖ సాప్ట్ స్కిల్స్ ట్రయినర్  సలీం బాష రెగ్యులర్ గా యువతకు సూచనలిస్తారు. ఇది పరిచయం మాత్రమే.
మొన్న.. డిగ్రీ ఉంటే ఎంచక్కా ఉద్యోగం వచ్చేది
నిన్న… డిగ్రీతో పాటు కొంచెం ఇంగ్లీషు, కొంత చొరవ, కొంత లోకజ్ఞానం ఉంటే ఉద్యోగం వచ్చేది.
ఇవాళ డిగ్రీతో పాటు చక్కగా మాట్లాడగలిగే సామర్థ్యం, ఇంగ్లీషు పైన పట్టు, జనరల్ నాలెడ్జ్, సబ్జెక్టు పరిజ్ఞానం, నేర్చుకునే తత్వం, కొంత క్రియేటివిటీ, ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది!!
రేపు..?!
ఇంకా ఏవేవో ఎన్నో ఉండాలి!
వాటినే ఉద్యోగ నైపుణ్యాలు అంటున్నారు.
నిన్న నుంచి నేటి దాకా ఎన్నో మార్పులు ఉన్నాయి. రేపు ఎటువంటి మార్పులు ఉంటాయో చెప్పలేం. ప్రపంచం మొత్తం కంప్యూటర్ వేగంతో పరిగెడుతుంది. నిన్న నేర్చుకున్నది ఇవాళ , ఇవాళ నేర్చుకున్నది రేపు సరిపోకపోవచ్చు. అందుకే నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంతో అనుసంధానం ఉండాలంటే ఇంకా ఏదో ఉండాలి. వాటిని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి లేదా ఇదివరకు నేర్చుకున్న వాటిని పదును పెట్టుకుంటూ ఉండాలి. ఉద్యోగార్థుల పై కంపెనీల అంచనాలు రోజు రోజుకి మారుతున్నాయి, పెరుగుతున్నాయి.
వరల్డ్ యూత్ డే (జూలై 15) సందర్భంగా అలాంటి నైపుణ్యాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతకు ఉంది. రేపటి ఉద్యోగానికి ఈరోజే సంసిద్ధంగా ఉండాలి. రోజు రోజుకి ఉద్యోగ స్వభావ స్వరూపాలు మారిపోతున్నాయి. వాటికి అనుగుణంగా యువత కూడా తమ నైపుణ్యాలను మలుచుకోవాలి
చాలా సంస్థలు ఉద్యోగ నైపుణ్యాల పై పరిశోధించి 2020 నాటికి కావలసిన నైపుణ్యాల జాబితా తయారు చేశాయి. రాబోయే దశాబ్దంలో ఆ నైపుణ్యాల ఆధారంగా కనీసం 25 లక్షల ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉంది అందుకే యువత ఉద్యోగ నైపుణ్యాలు సాధించడంలో ముందుండాలి. కళాశాల నుంచి అది వృత్తిపరమైన విద్య కావచ్చు సాధారణ పట్టభద్రులు కావచ్చు , పట్టా పుచ్చుకున్నంత మాత్రాన ఉద్యోగం వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. చదువుతోపాటు పట్టా వస్తుంది అయితే పట్టా తో పాటు ఇతరా నైపుణ్యా లు కూడా అత్యంత అవసరమైన అంశంగా మారిపోయాయి. ప్రస్తుతం రోబో ల కాలం. ప్రపంచం చాలా మారిపోయింది .కంప్యూటర్లు, తర్వాత ఆటోమేషన్ అనేది అన్ని రంగాల్లో చొచ్చుకుపోతుంది. ఇప్పుడు అవసర మైన లేటెస్ట్ నైపుణ్యాలను సాధించడం అనేది చాలా ముఖ్యం. ఈ నైపుణ్య సాధనలో ముఖ్యంగా భారతదేశంలో యువత చాలా వెనుకబడి ఉందని ఈ మధ్య జరిగిన సర్వేలలో తేలింది. ఈ ఉద్యోగ నైపుణ్యాల లోనే యువత తమ పరిజ్ఞానాన్నీ పెంపొందించుకోవాలని ఆ సంస్థలు సూచిస్తున్నాయి.
ఉద్యోగం నైపుణ్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1 హార్డ్ స్కిల్స్ 2 సాఫ్ట్ స్కిల్స్
ఈ ఆటోమేషన్ యుగంలో కంపెనీలు ఆశిస్తున్న హార్డ్ స్కిల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి . అవి ఆటోమేషన్ సంబంధిత లేటెస్ట్ టెక్నాలజీ పట్టు,? కోడింగ్ ప్రోగ్రామింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్, వంటివి ముఖ్యమైనవి, Artificial Intelligence, Block chain technology, Data Analytics, Cloud computing, IOT(internet of things), ML (machine language). ఇవి కళాశాలల్లో శిక్షణ సంస్థల్లో నేర్చుకునే అవకాశం ఉంది.
కానీ సాఫ్ట్ స్కిల్స్ అంత సులభంగా నేర్చుకునే అవకాశం లేదు. అయినా అది కళాశాలల్లో శిక్షణ సంస్థల్లో నేర్చుకో లేము. అవి ఒక సబ్జెక్ట్ లాగా ఉండవు. అదే వాటితో సమస్య. సాధనతో, కొంత గైడెన్స్ తో ఎవరికి వారు వాటిని నేర్చుకోవాలి.. నేర్చుకుంటూనే ఉండాలి. అలాంటివి కొన్ని….
కమ్యూనికేషన్ స్కిల్స్
క్రియేటివ్ థింకింగ్
కొలాబరేషన్ (team work)
కంటిన్యూయస్ అప్డేషన్
ఎమోషనల్ ఇంటలిజెన్స్
ఆడాప్టబిలిటి
కంప్యూటర్ లిటరసీ
టైం మేనేజ్మెంట్
మల్టీ డిసిప్లినరీ అప్రోచ్
సోషల్ ఇంటెలిజెన్స్
నావెల్ అండ్ అడాప్టివ్ థింకింగ్
క్రాస్ కల్చరల్ కాంపిటెన్సీ….
వగైరా
సాఫ్ట్ స్కిల్స్ లో అతిముఖ్యమైన నైపుణ్యాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యం. ఈమధ్య వృత్తిపరమైన విద్యాసంస్థల్లో కానీ . ఇతర కళాశాలలో గానీ ఈ నైపుణ్యాలను బోధించడానికి కొంత ప్రయత్నం అయితే జరుగుతున్నది.
అయితే ఆ ప్రయత్నం ఉండవలసిన అంత స్థాయిలో లేదని అర్థమవుతుంది. భావ వ్యక్తీకరణ నైపుణ్యాల కు ఉద్యోగ నైపుణ్యాలలో మొదటి స్థానం ఇచ్చారు. ఎందుకంటే బృంద చర్చల్లో కావచ్చు లేదా మౌఖిక పరీక్షల్లో (ఇంటర్వ్యూ స్కిల్స్) లేదా ఇతరులతో సమాచారం పంచుకునేందుకు కావచ్చు లేదా తమని తాము స్పష్టంగా ప్రకటించుకునేందుకు కావచ్చు అవసరమైన నైపుణ్యం.
నిజానికి ఈ నైపుణ్యం ద్వారా నాయకత్వ లక్షణాలు, సమయపాలన, నిర్ణయం సామర్థ్యం, ఒప్పించే నైపుణ్యం, కలివిడితనం, మార్కెటింగ్ సామర్థ్యం సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉండటం లాంటి అనేక మైన నైపుణ్యాలు అలవడతాయి.
ఇప్పుడు సంస్థలు క్రియేటివిటీ అంటే సృజనాత్మకత ఉందా లేదా చూస్తున్నారు. ఇది ఇప్పుడు ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్స్. అలాగే బృందా నైపుణ్యాలు అంటే అందరితో ఒక బృందంతో కలిసి కలివిడిగా ఉంటూ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంతో లాంటివి చేస్తున్నారా లేదా చూస్తారు ఇంకా దీంట్లోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా చూస్తారు అందుకోసం బృంద చర్చలు జరుపుతారు నైపుణ్యాలు కూడా ఏమైనది అలాగే adaptability(అంటే అవసరాలకు అనుగుణంగా తమని తాము మార్చు కుంటున్నారా లేదా) అనేది కూడా చూస్తున్నారు అది కూడా ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్స్ కిందికే వస్తుంది.
ఇంకా చెప్పాలంటే update చేసుకోవడం అంటే నిరంతరంగా అధ్యయనం చేస్తూ తమని తాము అనుగుణంగా ఉన్న అన్ని నైపుణ్యాలను సాధించే ప్రయత్నం చేస్తున్నారు లేదా అనేది కూడా ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్.
అలాగే మరో ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్ టైం మేనేజ్మెంట్. భారత దేశంలో టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా నిర్లక్ష్యం చేయబడిన సాఫ్ట్ స్కిల్. సమయ పాలన అనేది ఈమధ్య మనుషుల్లో ముఖ్యంగా యువతలో కనపడని అంశం. అలాగే ఇంకా చెప్పాలంటే యువత షార్ట్ కట్స్ పద్ధతుల్లో పని కావాలని యువత భావిస్తుంది. అంటే తమని తాము ఒక పరిజ్ఞానానికి అంకితం చేయడం లేదు దాంతో ఏమవుతుందంటే సబ్జెక్టు పరిజ్ఞానం బాగానే ఉన్నప్పటికీ సమయ పాలన లేకపోతే వారు ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించే అవకాశం తక్కువ.
ఇప్పుడు చూస్తే సాఫ్ట్ స్కిల్స్ అనేక రూపాలు సంతరించుకొని క్షణక్షణం మారుతూ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా రూపొందుతున్నాయి ఉదాహరణకు కంప్యూటర్ పరిజ్ఞానం దీని కంప్యుటేషనల్ థింకింగ్ అంటాం.
ముఖ్యంగా మామూలు కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేదు దాంతో ఏమవుతుందంటే ఈ ప్రపంచీకరణ లో ఆటోమేషన్ లో వారి వెనుక పడిపోయే అవకాశం ఉంది, లేటరల్ థింకింగ్ లేదా క్రిటికల్ థింకింగ్ అంటున్నారు.
ఉద్యోగంలో ఉత్పన్నమయ్యే అనేక మైన సవాళ్లకు జవాబుగా ఈ రకమైన థింకింగ్ ఉండాలని సంస్థలు భావిస్తున్నాయి సోషల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సాఫ్ట్ స్కిల్ ఈ మధ్య ప్రచారంలోకి వచ్చింది అంటే కలివిడితనం. పనిచేసే చోట అందరితో, సమాజంలో అందరితో కలివిడిగా ఉంటున్నారా లేకుంటే విడిగా ఉంటున్నారా అన్నది చూస్తారు. ఏకాంతంగా ఉండడంలో తప్పులేదు కానీ ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు.
మరొకటి క్రాస్ కల్చర్ కాంపిటెన్సీ అంటున్నారు అంటే యువత ఇతర దేశాలకు లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లినా కూడా అక్కడ వారితో వారితో ఎలా ప్రవర్తిస్తున్నారు వారిని ఎలా అర్థం చేసుకుంటున్నారు ఏ విధంగా మారుతున్నారు అనేది కూడా ఒకానొక సాఫ్ట్ స్కిల్.
అదేవిధంగా సోషల్ మీడియా అంటే అయినా ఫేస్బుక్ వాట్సప్ తర్వాత ఇంకా ఇతర వాటిల్లో యువత తమ ఆలోచనలు ఎలా పంచుకుంటున్నారు అక్కడ కూడా మళ్లీ మనకు ప్రజెంటేషన్ స్కిల్స్ వస్తాయన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంచుకోవడం.
ఎందుకంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే ట్రాన్స్ డిసిప్లినరీ అంటే మల్టీ డిసిప్లినరీ. వారు తమకు సంబంధించిన సబ్జెక్ట్ లోనే కాకుండా ఇతర సబ్జెక్టుల కూడా పరిజ్ఞానం కలిగి ఉండాలి ఉదాహరణకు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కేవలం కంప్యూటర్ గురించి కోడింగ్ గురించి నైపుణ్యాలు కాకుండా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా అంతో ఇంతో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి దాని గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య సంస్థలు ఆశిస్తున్న నైపుణ్యాల్లో ఇది కూడా ముఖ్యమైనదే
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఉద్వేగ ప్రజ్ఞ ఇప్పుడు మరో ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్ గా మారింది. ఉద్యోగంలో వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఇది అవసరమని కంపెనీలు భావిస్తున్నాయి. దీనివల్ల ఒత్తిడి నిర్వాహణ కూడా సులువే. ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో ఏంటో ఒత్తిడి ఉంటుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ఉద్వేగ ప్రజ్ఞ అవసరం. ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది.
భారతదేశంలో వచ్చే పదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం ఐటీ రంగంలో భారతదేశం నుంచి ఎగుమతుల విలువ 126 బిలియన్ డాలర్లు అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్దాయో.
రాబోయే కాలంలో ఆటోమేషన్ రంగంలో భారత దేశము ప్రధాన రంగంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే యువత దానికనుగుణంగా కావలసిన ఉద్యోగం నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేవలం పట్టభద్రులు అయితే చాలు అన్న కాలాలు పోయాయి.
ఇప్పుడు ఇంజినీరింగ్ లేదా ఇతర సాధారణ డిగ్రీతోపాటు నైపుణ్యాలు పెంపొందించుకో పోతే ఉద్యోగ అవకాశాలు దాదాపు లేనట్లే. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు మారుతున్న వేగం చూస్తే ఆ స్థాయిని అందుకోవడా నికి ప్రతి క్షణం సాధనతో అదనంగా ఇంకా అంటే అవసరాలకు అనుగుణంగా ఎన్నో నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే భారతదేశంలో రాబోయే పదేళ్లలో యువత సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచం యువ నైపుణ్యాల కోసం భారతదేశం వైపే చూడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
అందుకే ఈ ప్రపంచ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా భారతదేశపు యువత ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. నైపుణ్యాలన్నవి ఒక్కసారిగా లేదా ఒక్క రోజులో వచ్చేవి కావు. వాటికి సాధన కావాలి. వేమన గారు చెప్పినట్టు” అనగా అనగా రాగ మతిశయిల్లుచునుండు, తినగా తినగా వేము తియ్యనుండు ను, సాధనమున పనులు సమకూరు ధరలోన. అన్న విషయం గుర్తుపెట్టుకుని యువత వారిలోని నైపుణ్యాలకు పదును పెట్టడానికి సాధనే మార్గంగా శ్రమిస్తూ ఉంటే తప్ప ఉద్యోగ అవకాశాలు ఉండవు.
–సి.ఎస్.సలీం బాషా, ఫోన్ నెంబర్ 9393737937