ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఎగబడతారెందుకు? వాటిలో నిజమెంత?

ఎన్నికలు మొదలైనప్పటినుంచి ప్రజల దృష్టి మొత్తం ఒపినియన్ పోల్స్ మీద ఉంటుంది. ఏ ఒపినియన్ పోల్ ఏమి చెబుతుతుంది, ఏ సర్వే ఏం ఎవరు గెలుస్తారని చెబుతున్నదనే విషయం తెలుసుకునేందుకు జనం ఎదురుచూస్తుంటారు. ఎగబడుతుంటారు. ఎన్నికలపుడు మరో వ్యక్తి తారసపడగానే మొదట అడిగే ప్రశ్న, ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నావనే. దీనికి కారణం, మనం గెలుస్తుందనుకునే పార్టీయే గెలుస్తుందని అతగాడు చెబితే వినాలనే అదుర్దా యే ఇది. జనమంతా ఎగ్జిట్ పోల్స్ కోసం ఆకలితో ఎదురుచూడటం వెనక ఉన్న శక్తి  కూడా  మన గెలుస్తుందనుకునే పార్టీయే ఎగ్జిట్  పోల్స్ లో ముందుంది చూడండనే ధీమాయే. అయితే, ఎగ్జిట్ పోల్స్ పొల్లు పోకుండా ఫలితాలు చెప్పలేవని చరిత్ర చెబుతూ ఉంది.
జనానికి ఉన్న సహజమయిన ఒపినియన్ పోల్స్ మీద ఉన్న ఆత్రుత సర్వేల పేరుతో, ఇంటెలిజెన్స్ పేరుతో నో  ఫేక్ న్యూస్ కూడా షేర్ అవుతూ ఉంటాయి.
ఈ ఒపినియన్ పోల్స్ అన్నింటిలో కూడా ప్రజలంతాత్రంగా ఎదురుచూసే ఎగ్జిట్ పోల్స్ కోసమే.
 తాము ఆశిస్తున్న పార్టీ గెలుస్తుందని, తమ నమ్మకం అబద్దం కాదు అని రుజువు చేసే సాక్ష్యం ఇందులో దొరుకుతుందని ఓటేసిన ప్రతిమనిషి ఎగ్జిట్ పోల్స్ ఎదురుచూస్తుంటాడు.ఈ ఎగ్జిట్ పోల్స్ వెనక పెద్ద పెద్ద ఎన్నికల పండితులుంటారు కాబట్టి పండితులు చెప్పినవేవి తప్పుకావని  మనలో ఒక విశ్వాసం  బాగా నాటుకుపోయి ఉంది.

    ఫెడరల్ ఫ్రంట్ మానేసి, కెసిఆర్ ఎన్డీయేలో చేరవచ్చా?

నిన్న రాత్రి ఈ ఉత్కంఠ తొలిగిపోయింది. ముఖ్యంగా ఏప్రిల్ ఒకటో తేదీన ఓటేసి తెలుగు వాళ్ల ఉత్కంఠ అంత ఇంకాదు, అది తొలిగిపోయింది. కేంద్రంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీయే 300 అటు ఇటుగా సీట్లు లభిస్తున్నాయని  ఈ పోల్స్ చెప్పాయి.
ఈ నెల 23న కౌంటింగ్ జరుగబోతున్నది. ఇపుడు ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం అని ఒక చర్చ మొదలయింది. ఎగ్జిట్ పోల్స్ చరిత్రలో వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఇవి నిజం చెబుతున్నాయా లేదా అనే చర్చ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అధ్యయం చేశాయి. అవేమంటున్నాయో చూడండి.
ఎగ్జిట్ పోల్స్ గురించిన ఆసక్తి కరమయిన అధ్యయనమొకటి దక్కన్ హెరాల్డ్ పత్రిక లో వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ UBSసేకరించిన గత మూడు సార్వత్రి ఎన్నికల డేటాను డిహెచ్ విశ్లేషిస్తే ఎగ్జిట్ పోల్స్ ఎన్ డిఎ కు అనుకూలంగా పని చేశాయని అర్థమవుతుంది. ఈ పోల్స్ ఎన్ డిఎ పనితీరును 4.3 శాతం ఎక్కువ చేసిచూపించాయి.అదే సమయంలో యుపిఎ పనితీరును 8.9 శాతం తక్కువ చేసి చూపించాయి.
ఇంతకంటే ముఖ్యంగా గత మూడు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడిని పట్ల లేక పోయాయి. ఈము ఎన్నికల్లో రెండింట యుపి ఎ గెల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2004లో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఎ కు 252 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అంతకుముందు ఉన్న వాజ్ పేయి ప్రభుత్వం రికార్డు నెలకొల్పుతూ మూడో సారి అధికారం లోకి వస్తున్నదని పోల్స్ చెప్పాయి. ఈ అంచనా తలకిందులయింది.186 సీట్లుకు బిజెపి అండ్ కో పరిమిత మయింది. 219 స్థానాలు తెచ్చుకుని యుపిఎ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అప్పటి ఎగ్జిట్ పోల్స్ ఎన్ డిఎ పనితీరును 25.8 శాతం ఎక్కువ (overplay) చేసి చూపించాయి. అదే సమయంలో యుపిఎ పనితీరును 17.7 శాతం తక్కువచేసి (underplay)చేశాయి.
ఇక 2009లో ఏం జరిగింది? ఈ సారి కూడా యుపిఎ అధికారంలోకి వచ్చింది. యుపిఎ కి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి భిన్నంగా యుపిఎకి సీట్లు బాగా పెరిగాయి. యుపిఎ బలం 219 నుంచి 196కు పడిపోతుందని ఎగ్గిట్ పోల్స్ చెబితే, కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ 262 స్థానాలకు చేరుకుంది వూహించనంతగా బలపడింది. దీనికి భిన్నంగా ఎన్ డిఎ గెల్చుకున్నది కేవలం 159 స్థానాలనే. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది 197 స్థానాలు. అంటే తేడా 33.67 శాతం. ఈ సారి ఎన్డీఎ పనితీరను ఎగ్జిట్ పోల్స్ 14.97 శాతం ఎక్కువ చేసి చూపించాయి.
ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే… దేశమంతా మోదీ వేవ్ కనిపిస్తూ ఉంది. అపుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఈ మోదీ ప్రభంజనాన్ని అంచనా వేయలేకపోయాయి. మోదీ నాయకత్వంలో ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పినా, ప్రభంజనాన్ని చూల్లేక పోయాయి. ఎగ్జిట్ పోల్స్ ఎన్ డిఎకు 274సీట్లు వస్తాయని లెక్క కట్టారు. అయితే, ఎన్డీయే కు వచ్చిన స్థానాలు 336. తేడా 22.7 శాతం. ఇవే ఎగ్జిట్ పోల్స్ యుపిఎ కి 115 స్థానాలిస్తే, నిజానికి వచ్చినవి కేవలం 60 సీట్లు మాత్రమే.
ఇలా… ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ పోల్స్ ప్రజలేమనుకుంటున్నారో అంచనావేయడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రజల మనోభావాలను కచ్చితంగా అంచనావేయలేకపోయాయి.
బ్రెక్సిట్ వోటింగ్ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు అందలేదు. పోల్ స్టర్లు చెప్పినట్లు కాకుండా ఇంగ్లండు యూరోపియన్ యూనియన్ నుంచి వెళిపోవాలనుకుంది.  దీనితో పేరు మోసిన పోల్ స్టర్ పీటర్ కెల్నర్ తలదించుకోవలసి వచ్చింది.

అదే విధంగా 2016 అమెరికా ఎన్నికల ఫలితాలను కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. అమెరికా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ డెమో క్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తారని చెప్పారు. అక్కడ ట్రంప్  గెలచ్చి ఎగ్జిట్ పోల్స్ ను వెక్కించాడు.
  తాజాగా ఆస్ట్రేలియా ఫెడరల్ ఎలెక్షన్ ఫలితాలు ఎగ్జిట్ పోల్ స్టర్లను బాగా ఇరుకునపెట్టాయి. అక్కడ ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఢంకా భజాయించాయి. తీరా ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న స్కాట్ మారిసన్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా లిబరల్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఈ ఆపార్టీకి ఎగ్టిట్ పోల్స్ వూహించనంత అఖండ విజయం లభిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *