విస్కీ అంటే అర్థమేమిటో తెలుసా?

ప్రపంచ విస్కీ దినోత్సవం ప్రతి ఏడాది మే మూడో శనివారం జరుపుకుంటారు. విస్కీ ని ఆనందంగా ఆహ్లాదంగా సేవిచండం, విస్కీని దుర్వినియోగ పర్చకుండా జాగ్రత్తపడటం కోసం విస్కీ ప్రియులు ప్రపంచ విస్కీ దినోత్సవ జరుపుకుంటారు. 2020 లో  ఈ దినోత్సవం మే 16 జరుగుతుంది.
ఈ లోపు విస్కీలలో కింగ్ అయిన స్కాచ్ విస్కీ గురించి కొన్నివిషయాలు తెలుసుకుందాం.
విస్కీ అనే మాట స్కాట్లండ్ నుంచి వచ్చింది. అక్కడ మాట్లాడే గేలిక్ బాషలో Usquebaugh (అస్క్విబో) నుంచి విస్కీ అనే మాట వచ్చింది. అస్క్విబో అంటే జీవ జలం (water of life) అని అర్థం.
అదే విధంగా స్కాట్లండ్ లో తయారయ్యే విస్కీని మాత్రమే స్కాచ్ విస్కీ అంటారు. దీనికొక నిర్వచం ఉంది. దీనికి చట్టపరమయిన రక్షణ ఉంది.దేన్నంటే దాన్ని స్కాచ్ విస్కీ అనేందుకు వీల్లేదు.శాసనంతో తన ప్రత్యేకతనుకాపాడుకుంటున్న లిక్కర్ స్కాచ్ విస్కీ ఒక్కటే.
అంటే స్కాచ్ విస్కీ గొప్పతనాన్ని కాపాడుకోవాడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టం తీసుకువచ్చింది.
స్కాచ్ పవిత్రత అలాంటిది. చట్టం ఉల్లంఘించి రోడ్డు మీద కనబడిన మందునల్లా స్కాచ్ అని వూరించి అమ్మేస్తే శిక్ష పడుతుంది.
ఈ చట్టం పేరు Scotch Whisky Act,1988. ఈ చట్టం ప్రకారం కొన్ని నియమాలను రూపొందించారు. వాటిని Scotch Whisky Regulations 2009 అని పిలుస్తారు. ఈనియమాలలో స్కాచ్ విస్కీ  చాలా స్పష్టంగా నిర్వచించారు.
ఈ నిర్వచనం ప్రకారం అది తప్పనిసరిగా స్కాట్లండ్ లోనే తయారయి ఉండాలి. స్కాంట్లండ్ లో తయారీ అంటే డిస్టిల్లేషన్తో పాటు దీని తయారీ లో వాడే నీళ్లు కూడా స్కాట్లండ్ వే అయి ఉండాలి.
స్కాచ్ విస్కీతయారీలో వాడే బార్లీ, ఇతర ధాన్యాలు అన్నీ కూడా స్కాట్లండ్ సరుకే అయి ఉండాలి. స్కాచ్ విస్కీ ఏ ధాన్యంతో తయారయిందో ఆసువాసన కచ్చితంగా వచ్చేందుకు 94.8 శాతంలోపు అల్కహాలిక్ స్ట్రెంగ్త్ తో డిస్టిల్ చేయాలి.
ఇలా సేకరించిన కలి (fermentable substrate)ను 700 లీటర్ల కెపాసిటీ కి తక్కువ కాని పరిణామంతో ఉన్న ఓక్ పీపాలలోనే పులియబెట్టాలి. అపుడే అదే అధికారికంగా స్కాచ్ విస్కీ అవుతుంది.
స్కాచ్ విస్కీలో చాలా రకాలున్నాయి. అవి:
1.సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ: ఒకే డిస్టీల్లరీ లో తయారయింది.
2.సింగిల్ గ్రెయిన్ స్కాచ్ విస్కీ: ఇది కూడా ఒకే డిస్టిల్లరీలో నే తయారవుతుంది. దానికి తోడు మాల్టెడ్ బార్లీ నుంచి కాకుండా తృణ ధాన్యం నుంచి తయారవుతుంది.
3. బ్లెండెడ్ స్కాచ్ విస్కీ: పై రెండు రకాల స్కాచ్ విస్కీలను మిశ్రమం చేసి తయారుచేసేది.
4. బ్లెండెడ్ మాల్ట్ స్కాచ్ విస్కీ: దీనిని రెండు లేదా మూడు రకాల వేర్వేరు డిస్టిల్లరీస్ లో తయారయిన సింగిల్ మాల్ట్ విస్కీలను కలిపి తయారుచేస్తారు.
5. బ్లెండెడ్ గ్రైన్ స్కాచ్ విస్కీ: వేర్వేరు డిస్టిల్లరీస్ లో తయారయిన సింగిల్ గ్రెయిన్ స్కాచ్ విస్కీలను కలిపి తయారుచేసేది.
ఒక 25 మిల్లీ లీటర్ల స్కాచ్ విస్కీలో అరటి పండంత  క్యాలరీల శక్తి ఉంటుంది.
విస్కీ బాటిల్ సీల్ తీయకుండా ఉంటే ఎన్నాళ్లయినా అట్లే ఉంటుంది. కారణం  దీనికి గాలిలోని ఆక్సిజన్ తగలకుండా బిరడా బిగించి ఉంటుంది.
దీనివల్ల విస్కీ ఆక్సిడేషన్ కు లోనుకాదు. ఆక్సిడేషన్ ను నివారించేందుకు స్కాచ్ విస్కీ సీసాను టైట్ గా సీల్ చేసి బిగించేస్తారు. దీన్ని షెల్ఫ్ స్టేబుల్ గా చేయడం అంటారు.
ఒక సారి స్కాచ్ విస్కీ బాటిల్ వోపెన్ చేశాక, ఆక్సిడేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అందువల్ల బాటిల్ వోపెన్ చేశాక ఒక ఏడాదిలోపు లేదంటే రెండేళ్ల దాకా వాడవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, సీసాఖాళీ అయ్యేకొద్ది ఆక్సిడేషన్ జరగడం స్పీడందుకుంటుంది.
విస్కీ బాటిల్ మూత తీసి ఒక పెగ్గు లాగింతర్వాత సీసాలో ఏ మార్పు వస్తుందని ఎవరికీ పెద్ద గా అసవరం లేని టాపిక్. అందుకే దీని మీద పెద్దగా రీసెర్చ్ జరగలేదు. విస్కీ ఫ్యాక్టరీలో  బాటిల్ సీల్ చేసేటప్పటికి ఇందులో మొదటి చుక్కనుంచి చివరి చుక్క దాకా ఒకే రుచి ఉండేలా జాగ్రత్త పడి సీల్ చేస్తారు.
అయితే, ఒక సారి మూత తీసేశాక జిహ్వను బట్టి విస్కీ టేస్ట్ మారిపోతుంది. బాటిల్ ఆరింట అయిదొంతులు ఖాళీ అయ్యాక విస్కీ రచులు చాలా మారిపోతాయి. ఆక్సిడేషన్ విస్కీరుచిని మార్కేస్తుంది. పీపాలో ఉన్నపుడు విస్కీ అణువులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఆక్సిడేషన్ ప్రాసెస్ వీటిని తునాతునకలు చేస్తుంది.
విస్కీలో ఇథనాల్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిడేషన్ బాగా నిదానంగా సాగుతుంది. అదే వైన్ లో చాలా వేగంగా జరుగుతుంది. అందుకే మూత తీశాక వైన్ ను ఎక్కువ కాలం నిల్వ ఉంచలేం.
స్కాచ్ విస్కీ తయారీ లో కొంత భాగం గాల్లోకి ఆవిరవుతంది. దాన్ని ఏంజెల్స్ షేర్ (దేవుడి భాగం) అని పిలుస్తారు.
స్కాట్లండ్ నుంచి ప్రతి సెకన్ కు 34 బాటిల్స్ ఎగుమతవుతాయి. ఇంగ్లండు ఎగుమతి చేసే ఆహారం, పానీయాలలో 20 శాతం వాటా స్కాచ్ విస్కీదే. 2017లో దీనివల్ల ఇంగ్లండుకు 4.359 బిలియన్ పౌండ్ల రాబడి వచ్చింది.
స్కాట్లండ్ జనాబా 53 లక్షలు. కాని అక్కడ నిల్వ ఉన్న విస్కీ పీపాలు రెండు కోట్లు. అంటే తలసరి నాలుగుపీపాలన్నమాట.
వీటన్నింటిని ఒక దాని తర్వాత ఒకటి పేర్చితే 30 వేల కిలో మీటర్లదాకా వస్తాయి.
2017లో 30 సంవత్సరాలు మాగిన మాక్యాలన్ (Macallan) స్కాచ్ విస్కీ పీపా ధర 3,75,000 బ్రిటిష్ పౌండ్లు పలికింది. వేలంలో ఇంత ధర పలికిన స్కాచ్ విస్కీ పీపా మరొకటి లేదు.
జానీ వాకర్ అనే స్కాచ్ విస్కీ పేరు విన్నారుగా. ఇందులో జానీ అనే  వాడు  దీని నిర్మాత. ఆయన మొదట్లో ఒక కిరాణ కొట్టు నడిపేవాడు. అదే విధంగా  టీబ్లెండ్ చేసే వాడు. తర్వాత విస్కీ బ్లెండ్ చేయవచ్చఅనుకుని మొదలు పెట్టాడు. అంతే,  జానీవాకర్ అనే బ్లెండెడ్ విస్కీ తయారయింది.
అమెరికా స్థాపకుల్లో ఒక రైన జార్జి వాషింగ్టన్ కు ఒక డిస్టిల్లరీ ఉండేది. అయితే అది అగ్ని ప్రమాదంలో కాలిపోయింది.