ఉద్రిక్త కశ్మీర్ నుంచి వైరలయిన ఫోటో…

కశ్మీర్ ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. జనజీవనం పూర్తిగా సాధారణ పరిస్థితికి రాలేదు.  అర్టికల్ 370  రద్దు, రాష్ట్రం హోదా పోవడం, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో… ఈఉద్రిక్త వాతావరణ నెలకొంది. అక్కడి నుంచి ఇంతవరకు మిలిటరీ వార్తలే తప్ప ఆహ్లాదకరమయిన వార్తలు రావడం లేదు. ఇలాంటపుడు ఈ ఫోటో వైరలయింది.
సెక్యూరిటీ దళాలను అనుమానంగా చూస్తున్న వాతవారణంలో నుంచి ఒక సుహృద్భావం కల్గించో ఈ పోటో ట్విట్టర్ ప్రవేశించి హల్ చల్ చేస్తు ఊంది.
పబ్లిక్ రిలేషన్స్ లో భాగంగా ఈ ఫోటో సెషన్ ను సిఆర్ పిసి యే అరేంజ్ చేసిందా లేక సహజమా తెలియదు గాని, ట్విట్టర్ ఇది బాగా పాపులరయింది.
ఒక బుడతడు జంకు గొంకు లేకండా సిఆర్ పిఎప్ మహిళా అధికారితో కరచాలనం చేస్తున్నప్పటి ఈ ఫోటో మీద రకరాల వ్యాఖ్యాలు వచ్చాయి. ఈ ట్విెెట్టర్ ఫోటోని నాలుగువేల మందికి పైగా లైక్ చేశారు. 617 మంది రీ ట్వీట్ చేశారు.
అంతా ఫోటో ఒక గొప్ప సందేశమని ప్రశంసించారు.

 


అది కాదు వాస్తవం వేరే ఉంది అన్నవాళ్లూ ఉన్నారు.