సిబిఐ జెడిగా తెలుగు వాళ్లు వద్దే వద్దంటున్న విజయ్ సాయి రెడ్డి

హైదరాబాద్ లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధంలేని అధికారిని అంటే తెలుగేతరులను నియమించాలని హోం మంత్రి అమిత్ షాకు  వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తితో రాసిన లేఖ అమిత్ షా స్పందించారు. విజయ్ సాయి వినతి పై  తగిన  చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బందికి ఆయన సూచనలిచ్చారు .
తెలుగు అధికారులను సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా నియమించినందున విచారణ సక్రమంగా జరగదని వారు ఇక్కడి ప్రముఖుల ప్రభావానికి లోనవుతున్నారని  విజయసాయిరెడ్డి సోదాహరణంగా చెప్పారు.
ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని, చట్టప్రకారం నడుచుకునే వ్యక్తిని  హైదరాబాదులో సిబిఐ జెడిగా దేశ ప్రయోజనాల రీత్యా నియమించాలని ఆయన సుదీర్ఘ లేఖలోకోరారు.
గతంలో సిబిఐ జెడిగా ఉన్న లక్ష్మీనారాయణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని, వైయస్ జగన్కు ఇబ్బందులు సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నాయుడు నాటి జెడి లక్ష్మీనారాయణకు కు సూచనలిచ్చారని విజయ సాయి చెప్పారు. అంతేకాదు, జెడి లక్ష్మినారాయణ పలుమార్లు ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా అనేక సార్లు లక్ష్మి నారాయణ  చంద్రబాబుతో సంప్రదింపులు జరిపారని, చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇబ్బందులు సృష్టించాని ఆయన  అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన వచ్చిన  లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారని కూడా ఆయన లేఖలోపేర్కొన్నారు. తర్వాత,  తెలుగుదేశం పార్టీతో వ్యూహాత్మక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
 ఇపుడన్న సిబిఐ జాయింట్ డైరెక్టర్  నిబద్దత గురించి కూడా విజయసాయి అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత హైదరాబాద్ సిబిఐ జెడి కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి అని ఆయన పేర్కొన్నారు. కృష్ణ సైతం మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ  ప్రభావంలో ఉన్నారని, సూచనలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
మరొక ఆసక్తికరమయిన విషయం వెల్లడిస్తూ,  మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ సన్నిహితుడైన హెచ్. వెంకటేష్ అనే అధికారి ఇపుడు సిబిఐ జెడి  హైదరాబాద్ రావడానికి  ప్రయత్నిస్తున్నారని, దీనికోసం ఆయన తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఉత్తరం లో పేర్కొన్నారు.
కానీ ఆయన తల్లిదండ్రుల అంతా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే నని, ఆయన మూలాల న్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి  విజయ్ సాయి తెలిపారు. ‘లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సిబిఐ జెడిగా ఉన్న కా. ఆయన హయాంలో  ఎస్పీగా పని చేశారు. చంద్రబాబు తన మనుషులను సిబిఐలో పెట్టుకొని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో జరిగిన భారీ అవినీతి   నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తనకు తెలిసిన  అధికారులను సీబీఐ  హైదరాబాద్ లో కి  నియమించు కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ సిబిఐ జెడిగా నియామకాలు దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం  జరుగుతున్నాయి.’ విజయసాయి  చాలా తీవ్రమయిన ఆరోపణ చేశారు.
వీటన్నింటిని దృష్టిలోపెట్టుకుని ఈ నేపథ్యంలో తెలుగేతరుని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా నియమించాలని  విజయ్ సాయి రెడ్డి కోరారు.