ఆలయాల మీద దాడులన్నీ చంద్రబాబు పనే: విజయసాయి రెడ్డి

 ఈ రోజు టిడిపి వైసిపిల మధ్య రామతీర్థం రేసు రంజుగా సాగింది. చంద్రబాబు నాయుడికంటే ముందుగానే రామతీర్థం చేరుకునేందుకు పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిలించింది.చంద్రబాబు నాయుడికి దారిలో రోడ్డు మీద లారీలు అడ్డం పెట్టి ఆయన సకాలంలో రామతీర్థం చేరుకోకుండా చేయడంలో  ప్రభుత్వం విజవయవంతం అయింది.
చంద్రబాబునాయుడి పర్యటనను అడ్డుకోవడానికే డీజీపీ విజయసాయితో రామతీర్థం పర్యటన డిజైన్ చేయించారని
ప్రభుత్వ అనుమతి తీసుకొని రామతీర్థం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవడమేటని టిడిపి ప్రశ్నిస్తూ ఉంది.
ఈ అడ్డంకులు జాతీయ వార్తగా మారి జగన్  ప్రభుత్వానికి బాగా దుష్ప్రచారం లభిచిందనక తప్పదు. అయితే, చివరకు ఆలస్యంగానయినా చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకున్నారు.

రామతీర్థం ఈ రోజు రాజకీీయ జెండాలతో రెపరెపలాడింది.అధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన చోట రాజకీయ వేడి పెరిగింది. రామతీర్థం నుంచి విజయసాయి రెడ్డి  మాజీ ముఖ్యమంత్రి,  ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడి మీద తీవ్రంగా దాడి చేశారు. అసలు రాష్ట్రంలోని ఆలయాల మీద జరగుతున్న దాడులు తెలుగుదేశం పథకాలే ననేది విజయసాయి రెడ్డి విమర్శల సారాంశం. ఆయన దాడి ముఖ్యాంశాలు:
1-  అర్థరాత్రి చీకట్లో ఎవరూ చూడనప్పుడు, ఎటువంటి ఆధారాలు లేకుండా, రథాలు తగులబెట్టడం, విగ్రహాలు విరగ్గొట్టడం వంటి కుట్రపూరితమైన, నేరపూరితమైన పనులు చేయడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే చంద్రబాబు వ్యూహం. రామతీర్థం కొండపై జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరం.
2- మంచి పరిపాలన అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా, ఒక కుట్రపూరితంగా, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. విగ్రహాల విధ్వంసం చేయించి, పుకార్లు లేవదీయాల్సిన అవసరం చంద్రబాబుకు తప్ప వేరెవరికీ లేదు.
3- పప్పు నాయుడు లోకేష్ ఛాలెంజ్ విసిరాడు. మీరు అడిగినట్టుగా సింహాచలం అప్పన్న స్వామి సన్నిధికి నేను వస్తా. మీరు డేట్, టైమ్ చెప్పండి. మీ పాత్ర ఉందా.. లేదా అన్నదానిపై చర్చించడానికి నేను సిద్ధం.
– స్వయంగా నీవే రా. నీవే తేదీ నిర్ణయించు, సమయం నిర్ణయించు. నేను డిబేట్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
4- ఈరోజుకీ కూడా దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా టీడీపీ నేత అశోక్ గజపతి రాజే. ఆయన ఛైర్మెన్ గా ఉండగా, 30వ తేదీన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పెద్దఎత్తున ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ గారు ప్రారంభిస్తే.. దానిని డైవర్ట్ చేసేందుకు ఒకరోజు ముందు అంటే 29న ఇటువంటి నీచమైన పనికి చంద్రబాబు, ఆయన అనుచరులే పాల్పడి ఉంటారు.
– అశోక్ గజపతిరాజు ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి, నీతి, నిజాయితీ, విలువలు కలిగిన వ్యక్తి అయితే తక్షణం ఆయన రాజీనామా చేయాలి.
5. చంద్రబాబుకు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. చంద్రబాబు మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.   చంద్రబాబు గడచిన 5 ఏళ్ళ పాలనలో 20 వేల ఆలయాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. దేవాలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కు కూడా లేకుండాపోయింది.
 * తాను అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 39 పురాతన ఆలయాలను ప్రభుత్వమే కూల్చివేసింది.
* తిరుమలలో పోటు గదులను మూసివేసి.. వాటిలో తవ్వకాలు జరిపారు. దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి, సింహాచలం, పెందుర్తి ఆలయల దగ్గర భైరవ దేవాలయంలో క్షుద్ర పూజలు జరిగాయి.
* ఆలయాలపై చంద్రబాబు హయాంలో నియమించిన పాలక మండళ్ళ పెత్తనం అధికమై, వేధింపులు తట్టుకోలేక అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
* అర్చకులకు వంశపారపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని అర్చకులను అవమానించాడు. ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలు బంద్ అయ్యాయి. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి దుష్ట చట్టాలను చంద్రబాబు అమలు చేశారు.
* అమరావతి సదావర్తి భూములతో సహా.. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములను మింగేశారు.
* తప్పులు చేసే వారే గుడులకు వెళతారు.. అయ్యప్ప దీక్షల సమయంలో 40 రోజులు మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయి.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడే.

 

 

6. కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్, పేటెంట్ చంద్రబాబు నాయుడే కుట్ర- చంద్రబాబు కవల పిల్లలు. కుట్రలేనిదే చంద్రబాబుకు రాజకీయ మనుగడ లేదు. కుట్రలతోనే అతని రాజకీయ జీవితం ప్రారంభమైంది. కుట్రకు- చంద్రబాబుకు బంధం అలా ముడిపడి ఉంది.
– చంద్రబాబు కుట్రపూరిత జీవితమే.. ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.
– ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా.. అది చంద్రబాబు ఖాతాలో వేసుకుంటారు. ఎక్కడ చెడు జరిగినా వాటిని ప్రత్యర్థులపై నిందలు మోపడానికి వినియోగిస్తారు.
– నమ్మకం, విశ్వాసం, విలువలు, వ్యక్తిత్వం, సిద్ధాంతం.. అన్నవి బాబు పొలిటికల్ డిక్షనరీలో లేనే లేవు.
– బాబు డిక్షనరీ ఉన్న పదాలుః వెన్నుపోటు-వంచన-మోసం- ద్రోహం-దోపిడీ-దగా
– ఇందుకు నిదర్శనమే.. ఒక తల్లికి పుట్టిన సొంత తమ్ముడి దగ్గర నుంచి పిల్ల నిచ్చిన మామ, తోడల్లుడు, బామ్మర్దులు.. ఇలా ఎవరినైనా తన రాజకీయ అవసరం, అవకాశాల కోసం మోసం చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు.
– రాజకీయపరమైన సిద్ధాంతం కూడా బాబుకు ఏదీ లేదు. ఎప్పూడూ లేదు. ఊరసవెల్లి రంగులు మార్చినట్టు ఆయన పార్టీలు మారుస్తాడు. మనుషుల్ని మారుస్తాడు. అవసరానికి దేవుడు అంటాడు.. అవసరం తీరాక దెయ్యం అంటాడు.
– చంద్రబాబు కుటుంబ జీవితం, రాజకీయ జీవితం ఏది తీసుకున్నా.. ఆయనో టిపికల్ క్యారెక్టర్.
– చేతికి వాచీ, ఉంగరం లేదని పైకి మాట్లాడతాడు.. ముఖ్యమంత్రిగా దేశంలో అత్యంత ధనిక సీఎంగా ఆస్తులు కూడబెట్టుకుంటాడు.
– ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వారు మనుషుల్లో బహు అరుదుగా కనిపిస్తారు.. వీళ్ళని ఎటువంటి ఫీలింగ్స్ లేని యంత్రాలు, రోబో అనో అనాలి.
7. గత ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు చేసి.. ఎలా పరువు పోగొట్టుకున్నాడంటే..
*. తిరుమల టికెట్ల వెనుక అన్యమత ప్రచారం అన్నారు. పరువు పోగొట్టుకున్నారు.
*. తిరుమల కొండల్లో చర్చి అన్నారు.. నిజం బయట పడ్డాక పరువు పోగొట్టుకున్నారు.
*. శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తుల ఉద్యోగులు అన్నారు.. వారంతా చంద్రబాబు హయాంలో నియమితులైనవారే
అని తేలడంతో అక్కడా పరువు పోగొట్టుకున్నారు.
*. జగన్ మోహన్ రెడ్డిగారు తిరుమలలో చెప్పులేసుకున్నారని ప్రచారం చేసి చంద్రబాబే అభాసుపాలయ్యారు.
*. అమెరికాలో జగన్ గారు జ్యోతి వెలిగించలేదని ప్రచారం చేశారు.. అక్కడా పరువు పోగొట్టుకున్నారు.
8. జగన్ మోహన్ రెడ్డిగారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మానవత్వమే నా కులం.. మాట తప్పకపోవడమే నా మతం అని.
9. రామతీర్థం దుశ్చర్యకు చంద్రబాబు, ఆయన కొడుకే కారణం. ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి దేవాదయ శాఖకు ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం రూ. 1.50 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఎంత ఖర్చు అయినా తిరిగి పునః ప్రతిష్టిస్తాం.
10. 29 తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన మొట్టమొదటిగా చంద్రబాబు సోషల్ మీడియా ద్వారానే బయటకు వచ్చింది. దీనినిబట్టి ప్రపంచంలో ఎవరికీ తెలియకముందే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అశోక్ గజపతి రాజు కలిసి తమ సహచరుల ద్వారా ఈ దుశ్చర్యకు పాల్పడ్డని, ఆ తర్వాత వాళ్ళే ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేపట్టారని అర్థమవుతుంది.
11. ఇన్ని పాపాలు, అరాచకాలు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడకు రావడం అంటే.. తప్పు చేసిన వారే తిరిగి రాజకీయం చేస్తున్నట్టు ఉంది. ఎవరో పనికిమాలిన వెధవ అర్థరాత్రి ఎవరూ చూడకుండా విగ్రహాన్ని విరగ్గొడితే, దాన్ని చూడటానికి చంద్రబాబు వచ్చాడు. ఇలాంటివి చేయించేది చంద్రబాబే కాబట్టి, దేవుడు వేసే శిక్ష ఆయనకు తప్పదు.
– ఈపని చేయించినవాడికి, చేసినవాడికి కూడా కచ్చితంగా శిక్షలు తప్పవు.
– విగ్రహం విరగ్గొట్టిన విషయంలో దోషులు ఎంతవారైనా చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశించారు. చంద్రబాబు వ్యూహం ఒక్కటే- గతంలో కులాల పరంగా విభజన తీసుకొచ్చి ఎస్సీల మధ్య, బీసీల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం నడిపాడు.
– ఇప్పుడు అన్ని కులాల వారికి న్యాయం జరుగుతున్న మీదట.. కులాన్ని కొంతవరకు మాత్రమే రాజకీయం చేయగలుగుతున్నానని గమనించి, మతం మీద పడ్డాడు.
12. టీడీపీ నేర ప్రవృత్తికి తగినట్టుగానే, యథారాజా తథా ప్రజ అన్నట్టుగానే వాళ్ళ నాయకుడు చంద్రబాబు ఎటువంటి భావాలు కలిగి ఉన్నారో.. అలానే వారి పార్టీ కార్యకర్తలు మా మీద చెప్పులు, నీళ్ళ బాటిళ్ళు విసిరి, మా వాహనాల అద్దాలు పగులగొట్టారు. దీనికి చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు.. వీళ్ళంతా బాధ్యత వహించాలి.
13. బ్రిటీష్ వాడి కన్నా నీతి ఉంటుందేమో కానీ, తన సొంత కుటుంబాలనే రెండు ముక్కలు చేసిన చంద్రబాబు, విగ్రహాల్ని ముక్కలు చేయగలడు, సమాజాన్ని కూడా ముక్కలు చేయాలని ప్రతి కుట్రా చేస్తాడు.
14. మరి ఇటువంటి వ్యక్తికి హఠాత్తుగా దేవుడి మీద భక్తి వచ్చిందా.. ? కనీసం తుంగభద్ర పుష్కరాలు వస్తే, ఆ నది వద్దకు వెళ్ళి దణ్ణం కూడా పెట్టని ఈయనకు, ఈయన కొడుక్కి దేవుడు అంటే భక్తి ఉందా..? ఓట్ల రాజకీయాలు తప్ప విలువలతో కూడిన రాజకీయాలు చేయడం చంద్రబాబు డిక్షనరీలో లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *