రియా చ‌క్రవర్తికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్యూచర్ ఉంటుందా?

 సుశాంత్ మ‌ర‌ణించిన‌ప్పటి నుండి వార్తల‌లో నిలుస్తూ వ‌స్తున్న రియా ప్రపంచ మీడియా దృష్టిని కూడా ఆక‌ర్షించింది.
మాద‌క ద్రవ్యాల కేసులో దోషిగా ఉన్న రియా చ‌క్రవర్తితో పాటు ఆమె సోద‌రుడిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. వీరు బెయిల్ కోసం ప్రయ‌త్నించ‌గా, సెప్టెంబ‌ర్ 29న విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ నేపధ్యంలో ఆమెకు బాలీవుడ్ లో కెరీర్ ఎలా ఉండనుంది. అసలు బాలీవుడ్ లో ఆమెకు భవిష్యత్ ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తటం సహజం.
అయితే ఇక్కడ ఓ విషయం గుర్తు చేసుకోవాలి. రియా చ‌క్రవర్తి నిజానికి బాలీవుడ్ ని ఏలింది లేదు. పెద్ద ఆఫర్స్ వచ్చిందీ లేదు. ఆమె వీజే గా కెరీర్ ప్రారంభించింది. ఆ పరిచయాలతో ఐదారు సినిమాలు చేసింది. ఆ సినిమాలు కూడా చెప్పుకోదగ్గవేం కాదు.  మేరీ డాడ్ కీ మారుతి, సోనాలి కేబుల్ లాంటి చాలా చిన్న బడ్జెట్ సినిమాలు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బి.క్లాస్ సినిమాలు. అంటే సినిమాల ద్వారా సంపాదించింది పెద్దగా ఏమీ లేదు. కేవలం రొటేషన్ ఖర్చులు మాత్రమే వచ్చుంచాయి. ఇక బాలీవుడ్ లో అన్ని బాగున్నప్పుడే పెద్దగా ఆఫర్స్ లేవు. అయితే ఇప్పుడు భారతదేశం అంతటా ఆమె పేరు మారు మ్రోగింది కాబట్టి…ఈ కేసు నుంచి కనుక బయిటపడితే..ఆఫర్స్ మొదలవుతాయి. ఇన్నాళ్లూ ఇబ్బందిపడిందని సానుభూతితో కొంత వర్కవుట్ అవుతుంది. అలాగే ఆమెకు సపోర్ట్ చేసేవాళ్లు ఆఫర్స్ ఇప్పిస్తారు.
ఇదిలా ఉంటే ఆమె పేరుని క్యాష్ చేసుకోవాలనే తపన మాత్రం బాలీవుడ్ లో మొదలైంది.  రియా చక్రవర్తిపై బ‌యోపిక్ లేదంటే  డాక్యుమెంటరీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఒక ప్రచురణ సంస్థ కూడా నటి చెప్పే విష‌యాల‌ను  పుస్తకంగా తీసుకురావాల‌నే ప్రయ‌త్నం చేస్తుంద‌ట‌.
ఇక కేసు విషయానికి వస్తే…రియా బెయిల్ పిటిషన్లో, ఈమె నిర్దోషి అని ఆమె మరియు ఆమె కుటుంబంపై కఠినమైన ఆరోపణలు చేయడానికి ఎన్‌సీబీ “ఉద్దేశపూర్వకంగా” ప్రయత్నిస్తోందని పేర్కొంది. కాగా, రియాని ప‌లు కోణాల‌లో విచారిస్తున్న ఎన్సీబీ అనేక విష‌యాలు రాబ‌ట్టింది.