రమాప్రభకి సీక్రెట్‌గా మనీ పంపే టాప్ డైరెక్టర్ ఎవరు?

పలు భాషల్లో సుమారు 1400 సినిమాల్లో నటించి మెప్పించిన నటి రమాప్రభ. అలనాటి తారల నుండి ఈ తరం నటుల వరకు స్క్రీన్ షేర్ చేసుకున్న నటీమణి. తన అనుకున్న వారి చేతిలోనే మోసపోయి ఆస్తి పోగొట్టుకున్నారని చాలామంది నోటి నుండి వచ్చే మాట. ప్రస్తుతం ఆవిడ స్వగ్రామమైన మదనపల్లిలో సోదరుని ఇంట్లో నివాసముంటున్నారు రమాప్రభ. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
జీవితంలో అన్ని చూసేసాను ఇప్పుడిక ఏమీ మిగలలేదు అందుకే ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది. ఎంతమందిలో ఉన్న సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి ఏకాంతం కోరుకుంటాను. అందుకే తమ్ముడి ఇంటిపైన పెంట్ హౌస్ లో ఉంటాను. ఆధ్యాత్మికతకు దగ్గరయ్యాను అని చెప్పారు. మాటల మధ్యలో ఇంటర్వ్యూయర్ ప్రతి నెలా మీకు సీక్రెట్‌గా డబ్బు పంపిస్తున్న టాప్ డైరెక్టర్ ఉన్నారట నిజమేనా అని అడుగగా నిజమే అని అతని గురించి చెప్పారు రమాప్రభ. ఆ టాప్ డైరెక్టర్ ఎవరో కాదు బద్రి సినిమాలో రమాప్రభతో నటింపజేసిన పూరి జగన్నాధ్.
మా ఇద్దరికీ ప‌ర్స‌న‌ల్‌గా ఎటువంటి సంబంధం లేదు కానీ అతను వార్త పేపర్ లో నాపై వచ్చిన కధనం చూసి చలించిపోయాడట. ఒకసారి ఏదో సినిమా షూటింగ్ లో కలిసినప్పుడు నేను గుర్తున్నానా అని అడిగాను. ఆ తర్వాత ఏమనుకున్నాడో తెలియదు కానీ ప్రతి నెలా నాకు డబ్బు పంపిస్తున్నాడు అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *