తెలంగాణ ఆర్టీసి జెఎసి కి గవర్నర్ అభయం…

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు టిఆఎస్ ఆర్టీసిని ప్రయివేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, దీని మీద తగిన చర్య లు తీసుకోవాలని ఆర్టీసి జెఎసి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేసింది. జెసిఎసి నాయకుడు అశ్వత్దామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, విస్ రావు,  మహిళ కన్వీనర్ సుధా సమావేవం అనంతరం వివరాలను మీడియాకు తెలిపారు.  ఆర్టీసి కార్మికులు ధైర్యంగా ఉండాలని  గవర్నర్ సలహా ఇచ్చినట్లు తెలిపారు. సాధారణంగా వారానికొకసారి  కెసిఆర్ మనుపటి గవర్నర్ నరసింహన్ ను కలసి చర్చలు జరిపి ఆశీస్సులందుకునే వారు. ఇపుడ ఇంత పెద్ద సమ్మెజరుగుతున్నా  ఆయన ఇంకా గవర్నర్ ను కలవ లేదు. గవర్నరే రవాాణా మంత్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని, తర్వాత ఢిల్లీ వెళ్లినపుడు ఇక్కడేం జరుగుతున్నదోకేంద్రానికి వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీ సిజెఎసి నేతలు  ఆమెను కలుసుకున్నారు.

అశ్వత్థామ రెడ్డి చెప్పిన వివరాలు

* సమ్మె డిమాండ్ల పై నివేదిక ఇచ్చాము.
* బోర్డ్ అనుమతి లేకుండా సమ్మెలో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా అద్దె బస్సులకు టెండర్లకు పిలిచారని చెప్పాము.
* ఆర్టీసీ కార్మికులు దైర్యంగా ఉండాలని గవర్నర్ చెప్పారు.
* కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వం కాలయాపన చేస్తుంది.
* ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
* జేఏసీ కార్యాచరణ విజయవంతం అయింది.

* జూబ్లీ బస్ స్టేషన్ లో రేపు వంటావార్పు.
* ఆర్టీసీని లాకౌట్ చెయ్యడానికి ఎవ్వరికి అధికారం లేదు.
* ఆర్టీసీ ఆస్తులు కార్మికుల ఆస్తులు.
* ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతుంది.
* లాకౌట్ చేస్తా అంటే భయపడే ప్రస్తకే లేదు.
* లాకౌట్ చేసేందుకు సీఎం ఎవరు?

రాజిరెడ్డి ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్

  • సీఎం కేసీఆర్ సమ్మెకు పరిష్కారం కనుగొనడంలో జాప్యం చేస్తున్నారు.

    * గవర్నర్ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నారు.

    * దేశ వ్యాప్తంగా అందరి సహకారం ఉంది.

వీఎస్ రావు కో కన్వీనర్

* గవర్నర్ ఆర్టీసి కార్మికుల డిమాండ్ ల పట్ట సానుకూలంగా స్పందించారు.
* ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు.
* సింగరేణి కార్మికులను త్వరలో కలుస్తాము.

సుధా మహిళా కన్వీనర్ జెఏసి

* ఎవ్వరి ప్రలోభాలకు లొంగకండి.
*గవర్నర్ మాకు అభయమిచ్చారు.

(Phot: Times of India_