’టిఆర్ ఎస్, బిజెపి ‘పసుపు’ రాజకీయాలు బోర్ కొడుతున్నాయ్’

తెలంగాణలో పసుపు పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయడంతో పాటు, పసుపు బోర్డు ఏర్పాటు  చేయడంలో  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఫెయిలయ్యాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు భట్టి విక్రమార్క మల్లు వ్యాఖ్యానించారు. గతంలో ఎంపిగా ఉన్న కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు గురించి చాలా ఉత్తుత్తి హామీలు చేశారు. దానితో ప్రజలు ఆమెను ఓడించారు. తర్వాత గెల్చిన బిజెపి ఎంపి అర్వింద్ ఇంకా ఎక్కువ హామీలు చేశారు. జరిగింది శూన్యం అని భట్టి వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు గురించే కవితను ఓడించారు, ఇపుడు అదే రైతులు అరవింద్ ను నిలదీస్తున్నారని చెబుతూ చివరకు రైతుల ఆగ్రహం వల్ల నిన్న అరవింద్ మీటింగ్ వదలి పారిపోవలసి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే టిఆర్ ఎస్, బిజెపి లు రెండు బాధ్యతను ఒకరి మీద ఒకరు తోసుకుంటూ పసుపు నాటకాలు ఆడుతున్నారని పసుపు డ్రామా కట్టిపెట్టి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ రోజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

రెండు ప్రభుత్వాలు పసుపు  రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నాయి, రెండు ప్రభుత్వాలు వెంటనే  రైతుల ఇబ్బందులపై దృష్టి  పెట్టాలని , మద్దతు ధర కల్పించి  రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

భట్టి ఇంకా ఏమన్నారంటే…

రాష్ట్రంలో ప్రతి ఏటా  వేలాది ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు.  రైతుల  కష్టానికి తగ్గ ఫలితం వుండటం లేదు. ఈ సంవత్సరం కూడా  నిజామాబాద్ జిల్లాలో  దాదాపు 40, 624 ఎకరాల్లో పంట వేశారు,  నిర్మల్ లో 26, 165 వేల ఎకరాలు ,జగిత్యాలలో 34 ,078 ఎకరాలు, వరంగల్ రూరల్లో 16 ,739 ఎకరాలు, భూపాలపల్లిలో 1766 ఎకరాలు, మహబూబాబాద్ లో 10,234 ఎకరాలు, వికారాబాద్ లో 4200 ఎకరాలు, పెద్దపల్లి లో 1491  ఎకరాలు, సంగారెడ్డిలో 1388 ఎకరాలు, వరంగల్ అర్బన్ లో 1091ఎకరాలు, కరీంనగర్ లో 633 ఎకరాలు ,ఆదిలాబాద్ 362 ఎకరాలు, కామారెడ్డిలో191 ఎకరాలు, మంచిర్యాల లో 140 ఎకరాలు,  భద్రాద్రి కొత్తగూడంలో 138 ఎకరాలు,   ఖమ్మం లో 77 ఎకరాలు,  జనగాం లో 50 ఎకరాలు రంగారెడ్డి లో 25  ఎకరాలు, సూర్యాపేట  8 ఎకరాలు, మెదక్ ఎకరాలు, సిద్దిపేట లో 2 ఎకరాలు లో మొత్తం 1,39,698 ఎకరాలు లో పంట వేశారు. మద్దతు ధర కల్పించకపోవడం వల్ల  రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు, పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు.  గతంలో 8 ఏళ్ళ క్రితం క్వింటాలు ధర 15 వేలు పలకగా ప్రస్తుతం 6 వేలకు మించి రావడం లేదు. ,కేవలం నాలుగు నుండి ఐదు వేలు మాత్రమే లభిస్తా ఉంది.  దాంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీళ్లని ఆదుకోవడం మానేసి బిజెపి , టిఆర్ ఎస్ ఒకరి మీద ఒకరు బురద చల్లు కుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *