Home Uncategorized తమిళనాాడులో యాంటి క్లైమాక్స్, శశికళ రాజకీయ సన్యాసం

తమిళనాాడులో యాంటి క్లైమాక్స్, శశికళ రాజకీయ సన్యాసం

203
0
శశికళ నటరాజన్ (facebook timeline picture)

తమిళనాడు రాజకీయాల్లో యాంటి క్లైమాక్స్. ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ శశికళ ఇక అక్కడి ఎఐడిఎంకె నేతలకు చుక్కలు చూపిస్తుందని , రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతుందని అనుకుంటున్న పుడు   అనుకోని ట్విస్ట్ ఇచ్చారు.

తాను రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

జయలలిత కు సలహాదారుఉన్న శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవించి కొద్దిరోజుల  కిందట విడుదలయ్యారు. ఆమె రాజకీయ ప్రవేశం మీదరకరకాల వూహాగానాలు సాగుతున్నసమయంలో ఆమెతమిళంలో  ప్రింటు చేసిన ప్రకటన విడుదల చేస్తూ రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈలేఖ ఇంగ్లీష్ అనువాదం ఇలా ఉంటుంది.

” I have never been after power or position even when Jaya was alive.  Won’t do that after she is dead. I am quitting politics.

“ I will pray to god and my sister (Jayalalithaa) for AIDMK’s victory and urge supporters of AIADMK to work together and defeat the DMK. I urge you to keep her legacy going.  I pray her party (AIADMK) wins, and her legacy lives on.”

 

 ఈ ప్రకటనని ఆమె మేనల్లుడు టిటివి దినకరణ్ విడుదల చేశారు. దీనివెనక ఏదో బలీయమయిన కారణముంటుందని అనుకుంటున్నారు. ఏదో పెద్ద శక్తి ప్రోద్బబలంతోనే శశికళ ఏకంగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రటించారని చెబుతున్నారు. దీని మీద ఇంకా ప్రత్యర్థి పార్టీ డిఎంకె స్పందించలేదు. ఆమె జైలుకెళ్లినప్పటి సీన్ గుర్తున్నవాళ్లెవరు ఇది ఆమె మనస్ఫూర్తి గా తీసుకున్న రాజకీయ సన్యాసం అనుకోరు.

జైలు కెళ్లే ముందు శశికళ చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా?

1991-96 మధ్య జయలలిత ముఖ్యమంత్రి గా ఉన్నపుడు రు.66.65 కోట్లఆస్తులను అక్రమంగా కూడబెట్టారన్న కేసులో జయలలితో పాటు ఆమకు, సోదరి ఇలవరసుకు ఫిబ్రవరి 14న  నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ జనవరి 27 ఆమె శిక్షా కాలం పూర్తయింది.

ఫిబ్రవరి 15, 2017న  బెంగుళూరు జైలుకు బయదేరే వ్యాన్ ఎక్కే ముందు శశికళ చెన్నై మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దర్శించారు. అక్కడ సమాధి మీద మూడు పిడిగుద్దులు గుది, “ నేను జైలు నుంచి తిరిగొస్తాను. కుట్రకు, ద్రోహానికి ప్రతీకారం  తీర్చుకుంటాను,” అని ప్రతిజ్ఞ చేశారు.

నిజానికి జయలలిత చనిపోయాక  శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధమయింది. ఈ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నపుడు  2017 ఫిబ్రవరి 14న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఆమె ఆశల్ని వమ్ము చేసింది.

2004 నాటి అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు విధించిన  శిక్షని సుప్రీంకోర్టులో  ఖరారయింది. జైలు కెళ్లాల్సి వచ్చింది.

తర్వాత ఆమె ఇపిఎస్-ఒపిఎస్ (EPS-OPS) కంట్రోల్ లో ఉన్న  ఎఐఎడిఎంకె నుంచి 2017 ఆగస్టులో ఆమె జైలులో ఉన్నపుడు బహిష్కరించారు.

తమిళనాడు రాజకీయాలు ఈ మధ్య ఏ మాత్రం రసవత్తరంగా లేవు. జయలలిత, కరుణానిధి చనిపోయాక ఇక బిజెపి దూకుతుందని, ద్రవిడ రాజకీయాలనుంచి తమిళనాడుని కాషాయ రాజకీయాల్లోకి లాక్కొస్తుందనుకున్నారు. అదీ జరగలేదు. అంతా స్టేటస్ కో కు అడ్జస్టయిపోయారు.

పళని  స్వామి , పన్నీర్ సెల్వమ్ (EPS-OPS) కూటమి చెక్కు చెదరకుండా పరిపాలన సాగిస్తూ ఉంది. ఇపిఎస్ అంటే,  ముఖ్యమంత్రి ఇ పళని స్వామి, ఒపిఎస్ అంటే ఉపముఖ్యమంత్రి  ఒ పన్నీర్ సెల్వమ్. శశికళ జైలు పోయాక కొద్ది రోజులు కొట్లాడుకున్నా,  తర్వాత రాజీ అయి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదువులను పంచుకుని  హయిగా ఉంటున్నారు. వీళ్లకి పైనుంచి బిజెపి అండ ఉందని చెబుతున్నారు.

2021 మే జరిగే ఎన్నికల్లో ఎఐఎడిఎంకె ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళని స్వామి అని ప్రకటించుకున్నారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here