శుభవార్త, యూరోప్ లో తగ్గుముఖం పట్టిన కరోనా

శుభవార్తే. చప్పట్లు కొట్టకుండా ఉండలేం. ఎందుకంటే,మనకందిన చారిత్రక సమాచారం ప్రకారం ప్రపంచం ఎపుడూ ఒక్కసారిగా ఇలా తాళమేసుకుని కూర్చోలేదు.
మానవ జాతి మొత్తం ప్రపంచం నుంచి ఉపసంహరించుకుని బిక్కు బిక్కు మంటూ ఇంట్లో నక్కి కూర్చున్న సంఘటన లేదు. యుద్ధాలపుడో, మరొక చిన్న ఉపద్రవం ఎదురయినపుడో ఏవో కొన్ని ప్రాంతాల్లో ఇలా లాక్ డౌన్ అంటూ మనిషి భయపడి ఏదో మూలకు పారిపోయివుండవచ్చు.
అయితే, ఇలా మానవజాతి మొత్తం గూటికి పరిమితమయిపోయిన భయానక సన్నివేశం మనకందిన మానవ జాతిచరిత్రలో లేదు.అందుకే ఎక్కడయినా బీజ ప్రాయంగా నైనా ఒక మంచి వార్త వస్తే కేరింతలు కొట్టాల్సిందే. చప్పట్లు చరచాల్సిందే.
అవును, నిజంగా మంచి వార్త  ఇపుడు యూరోప్ నుంచి వస్తున్నది. కరోనా సంక్షోభం అక్కడ తగ్గు ముఖం పట్టినట్లుసమాచారం అందింది. జాన్స్ హాప్ కిన్స్  యూనివర్శిటీ అందిస్తున్న సమాచారం ఒక ఆశాకిరణం యూరోప్ కనిపించింది. అపుడే పండగ చేసుకోదగ్గ సమయం కాదని చెబుతూ జెహెచ్ యు కి చెందిననిపునుడు క్రిస్టల్ వాట్సన్ ఒక  మంచిపరిణామం యూరోప్ లో కనిపించిందని ఫాక్స్ న్యూస్ కు చెప్పారు.
‘యూరోప్ నుంచి వస్తున్న డేటా ఆశాజనకంగా ఉంది.  ఇళ్లకే పరిమితమయిపోయి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తుండటం పనిచేస్తున్నట్లుంది,’ అని వాట్సన్ చెప్పారు.
ఈ విషయం స్పెయిన్ విషయంలో స్పష్టంగా కనిపించిందని ఆయన చెప్పారు.
‘మంగళవారం నాడు  స్పెయిన్ లో 637 మంది చనిపోయారు. ఇది ఇంకా వణుకు పుట్టించే వార్తే. అయితే  ఇంకా  5.6 శాతం పెరుగుదలను సూచించినా, గత వారం మృతులతో పోలిస్తే సగానికిసగమే,’ అనివాట్స్ చెప్పారు.
కరోనా తగ్గు ముఖం పడుతుండటంతో చాలా దేశాల్లో లాక్ డౌన్ ను సడలిస్తున్నారు. సోమవారం నుంచి జర్మనీలో కొందరు రిటైలర్స్,కారు డీలర్స్, సైకిల్ షాపులు,పుస్తకాల షాపులు తెరవడం మొదలుపెట్టారని వాయిస్ ఆప్  అమెరికా (VOA) రాసింది. 800  చదరపు మీటర్ల సైజులో ఉన్న రిటైర్ల షాపులు తెరవాలనిచాన్స్ లర్ ఎంజెలా మెర్కెల్ రాష్ట్రాల నేతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇక సౌత్ కొరియా, హైరిస్క్ ప్రాంతాలయినచర్చిల, బార్ల , క్రీడావసతుల మీద  మ మీద ఆంక్షలను తొలగించింది.