Home Uncategorized రష్యన్ వ్యాక్సిన్ Sputnik V హైదరాబాద్ వచ్చేసింది (వీడియో)

రష్యన్ వ్యాక్సిన్ Sputnik V హైదరాబాద్ వచ్చేసింది (వీడియో)

44
0
Sputnik V vaccine/ RDIF
 కరోనా వైరస్ కు విరుగుడు రష్యా సృష్టించిన Sputnik V వ్యాక్సిన్ ఇండియా లో అడుగు పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ కి వ్యాక్సిన్ చేరుకుంది. ఇక క్లినికల్ ట్రయల్స్ మొదలు కానున్నాయి. ఈ ట్రయల్స్ విజయవంతమైన వెంటనే వీలైనంత త్వరగా ప్రజలకు అందించనున్నారు అధికారులు. భారతదేశంలో ఈ వ్యాక్సిన్  క్లినికల్ ట్రయల్స్ జరిపి మార్కెట్ లోకి విడుదల  చేసేందుకు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) కు చెందిన క్లినికల్ ట్రయల్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి.

ఈ వ్యాక్సిన్ గురించి వివరాలు:
చడీచప్పుడు లేకుండా రష్యా గమ్మున కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసింది. అదిగో వస్తాంది,ఇదిగో వస్తాంది అని రోజూ ఆర్భాటంగా ప్రకటనల చేసిన ఏదేశమూ ఇంతవరకు వ్యాక్సిన్ విడుదల చేయలేదు.  రష్యా మాత్రం ప్రకటనల ఆర్భాటానికి పోకుండా కామ్ గా  వ్యాక్సిన్ విడుదల చేసింది.ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ స్వయంగా ప్రకటించి విస్మయ పరిచాడు.
స్పుత్నిక్ -5?
ఇలా రష్యా ప్రపంచాన్ని  సర్ ప్రైజ్ చేయడం  ఇది రెండో సారి. మొదటి సారి 1957 అక్టోబర్ 4 ఇలాగే ఒక్కసారిగా ప్రపంచమంతా షాక్ తినేలా, ముఖ్యంగా  అమెరికాకు కళ్లు బైర్లు కమ్మేలా చేసింది.అపుడేం జరిగిందంటే..
 1950 దశకంలో అమెరికా  అంతరిక్షంలో భూ కక్ష్యలోకి ఒక మానవ నిర్మిత ఉపగ్రహం ప్రవేశపెట్టాలని చూస్తూ ఉంది.ఉవ్విళ్లూరుతూూ ఉంది.  రోదసిలో కూడా  అమెరికా జండా ఎగరేసి తన సాంతికేతిక ఆధిపత్యాన్ని చాటుకునేందుకు అమెరికా పరిశోధనలు ప్రారంభించింది. ఆకాశంలో  అల్లంత ఎత్తున  భూమి చుట్టూర అమెరికా జండా  తొందర్లో తెరుగుతుందని టివిలో ఒకటే చర్చలు నడుస్తున్నాయి. రష్యా ఉపగ్రహ నిర్మాణం గురించి, సాంకేతిక అధిపత్యం గురించి పేపర్లలో తెగ విశ్లేషణలు వస్తున్నాయి. అయితే, 1957 అక్టోబర్ 4 రష్యా బాంబు పేల్చింది. నిశబ్దంగా స్పుత్నిక్ 1 ని ఆకాశంలోకి ప్రవేశపెట్టింది. అది విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. ఇది అమెరికాకు నిద్రపట్టనీయని  రోజయింది. మానవ జాతి చరిత్రలో భూ కక్ష్యలోకి ఒక మానవ నిర్మిత వస్తువును విసిరేసిన ఘనత రష్యాకు దక్కింది. దీనితోనే అమెరికా అప్పటి సోవియట్  రష్యాల  మధ్య స్పేష్ వార్ మొదలయిందని చెబుతారు.
అందుకే ఇపుడు ఇలాగే ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేస్తూ వచ్చిన ఈ వ్యాక్సిన్ ని స్పుత్నిక్ -5 అని పిలుస్తున్నారు. ఈవ్యాక్సిన్ మాస్కో లోని గమలేయా ఇన్ స్టిట్యూట్ (Gamaleya Institute) తయారుచేసింది.
అంతేకాదు, ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తూ ఉందని, ఇది రష్యాకే కాదు, ప్రపంచానికంతటికీ శుభవార్త అని, ఈ రోజు  మర్చిపోలేని రోజు అని పుతిన్ ప్రకటించారు. రష్యా వ్యాక్సిన్ ప్రాణాపాయకరమయిన కోవిడ్  కు వ్యతిరేకంగా సమర్థవంతంగా రోగనిరోధక శక్తిని పెంచిందని ఆయన పేర్కొన్నారు.
“ As far a I know, a vaccine against the coronavirus infections has been registered this morning (in Russia) for the first time in the world.” అని పుతిన్ ప్రకటించారు.
ఈ  విషయాన్ని ప్రభుత్వాధికారులకు వెల్లడిస్తూ, “ I know that it works rather effectively, form a stable immunity, and, I repeat, it passed all the necessary inspections,” అని  కూడా ఆయన ప్రకటించారు.

అయితే, వ్యాక్సిన్ బలవంతంగా ఎవరికీ ఎక్కించవద్దని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారికే ఎక్కించాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాదు, తన కూతుర్లలో ఒకరికి ఈ వ్యాక్సిన్ ఎక్కించడం జరిగిందని కూడా ఆయన వెల్లడించారు.”ప్రతి డోస్ తర్వాత ఆమెకు కొద్దిగా జ్వరం వచ్చింది. అయితే ఇపుడు బాగుంది,’ అని ఆయన వెల్లడించారు.
రష్యా వ్యాక్సిన్ జనవరి నుంచి జనరల్ సర్య్యులేషన్ కు వెలుతుందని, ఈ మధ్యలో మెడికల్ వర్కర్స్ కి, టీచర్లకు ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని పుతిన్ చెప్పారు.
 “ We will begin the stage-by-stage civilian use of the vaccine. First and foremost, we would like to offer vaccination to those who come into contact with infected persons at work. These are medical workers. And also who is responsible for children’s health-the teachers,’ అని ఈ సందర్భంగా మాట్లాడుతూ రష్యా హెల్త్ మినిస్టర్  మిహయీల్ మురాష్కో చెప్పారు.
ఇంత తొందరగా రష్యా నుంచి వ్యాక్సిన్ వస్తుందని పాశ్చాత్య దేశాలేవీ వూహించలేకపోయాయి. కరోనాకు తొందరగా వ్యాక్సిన్ తీసుకురావాలనుకున్నఅమెరికా , ఇంగ్లండు వంటి దేశాలు రష్యా ప్రకటనతో కంగుతిన్నాయి.   దీనితో ఏదో విధంగా రష్యా విధానంలో లోపం ఉందని చెప్పుందుకు రంధ్రాలు వెదుకుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ పూర్తిగాక ముందే  ప్రజలకు ఈ వ్యాక్సిన్ ఎక్కించి వాళ్ల ఆరోగ్యానికి ముప్పు తేవద్దని అసోసియేషన్ ఆప్ క్లినికల్ ట్రయల్స్ ఆర్గనేజేషన్స్ (ACTO)  రష్యా హెల్త్ మినిష్టర్  మురాష్కోకు లేఖరాసినట్లు బ్లూమ్ బర్గ్ (Bloomberg) రాసింది. కార్పొరేట్ కంపెనీలన్నీ రూల్స్ ఫాలో అవుతున్నాయని, రష్యా ఫాలో కావడంలేదని ACTO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వెట్లానా జావిడోవా చెప్పినట్లు బ్లూమ్ బర్గ్ కు చెప్పారు.
సైన్స్ టెక్నాలజీ రంగంలో తన ఆధిపత్యం చాటుకునేందుకు రష్యా ప్రభుత్వం వత్తిడి తీసుకువచ్చి తొందరగా వ్యాక్సిన్ విడుదలచేసే చేసిందని రష్యా విమర్శకులు చెబుతున్నారు.
అయితే, మాస్కో సెఖెనవ్ యూనివర్శిటీ (Sechenov University) చెందిన ఒక పెద్ద శాస్త్రవేత్త వదిమ్ తరసోవ్ (Vadim Tarasov) వైరస్ లు రోగాలను ఎలా వ్యాప్తిచెందిస్తాయో అనే దాని మీద రష్యా 20 సంవత్సాలుగా పరిశోధనలు చేస్తూ చాలా అవగాహన పెంచుకుందని, అందుకే ఇపుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందుకు దూసుకుపోయిందన చెప్పారు. కామన్ కోల్డ్ కు సంబంధించిన ఎడినో వైరస్ టెక్నాలజీ ఉపయోగించి ఈ వ్యాసిన్ తయారు చేశారని, కృత్రిమంగా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రొటీన్లు కోవిడ్ -19 ప్రోటీన్లను పునురుత్పత్తి చేస్తాయని, అపుడు కరోనావైరస్ కు విరుగుడుగా పనిచేసేలా రోగనిరోధ వ్యవస్థ స్పందిస్తుందని ఆయన చెప్పారు.
దీనికి పునాదులు సోవియట్ యూనియన్ లోనే పడ్డాయి
Vadim Tarasov/RBTH
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారుచేయడంలో రష్యా ఇంత తొందరగా విజయవంతం కావడం వెనక పూర్వం సోవియట్ నాటి రోజులలో వేసిన పునాది ఉందని వదిమ్ తరసోవ్ చెప్పారు. సోవియట్ కాలంలో వ్యాక్సిన్లతయారీకి   రష్యా సమర్థవంతమయిన సంస్థలండేవని, ఆ అనుభవం వల్ల రష్యాఇపుడు సులభంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేయగలిగిందని ఆయన చెప్పారు.
“The Soviet Union had one of the strongest schools for creating vaccines. This know-how helped out country (Russia) to develop this vaccine so fast. The scientific groundwork that was created in the Soviet Union and later developed in the Russian Federation allows us to be the first in the world to announce these results” అని తరసోవ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here