కొడంగల్ లో మంత్రులకు నిరసన సెగ (వీడియో)

తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డికి ఊహించిన పరిణామం ఎదురైంది. కొడంగల్ లో బుధవారం పలు అభివృద్ధి పనుల నిమిత్తం వారు పర్యటించారు. అయితే మద్దూరు మండలంలోని నందిగామ గ్రామంలో వివాదం రేగింది. మంత్రులు ఆలస్యంగా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి తనతోపాటు సర్పంచ్, ఎంసిటిసిలు కలిసి బిటి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రుల పర్యటన ఉండగా మీరెట్లా ప్రారంభిస్తారంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలోనే శిలాఫలకం మీద పోలీసులు పడిపోవడంతో అది ధ్వంసమైందని చెబుతున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే రేవంత్ అనుచరులు శిలాఫలకం పలగ్గొట్టిర్రని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసులు నమోదయ్యాయి. రేవంత్ కు వ్యతిరేకంగా గ్రామంలో టిఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. ఈ క్రమంలో రేవంత్ వాహనాలను పోలీసులు కదలకుండా చేయడంతో ఆయన అక్కడినుంచి తప్పించుకుని  బైక్ మీద కొడంగల్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో మద్దూరు మండలంలోనే జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ మంత్రులిద్దరితోపాటు ఎమ్మెల్సీకి కాంగ్రెస్ కార్యకర్తలు చుక్కలు చూపించారు. మంత్రుల వద్దకు వచ్చి జై కాంగ్రెస్.. జై రేవంత్ అంటూ స్లోగన్లు చేయడం మంత్రులకు చికాకు తెప్పించింది. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు, మంత్రుల పరిస్థితి ఎలా ఉందో కింద వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *