“సగం దేవుడు -సగం దయ్యం”- మారడోనా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు!

సాకర్(ఫుట్ బాల్) లో ఈ శతాబ్దపు అత్యుత్తమ గోల్ చేసినవాడు ఎవరు అంటే, ఫుట్ బాల్ గురించి ప్రపంచ కప్ గురించి వాళ్ళు కూడా చెప్పే పేరు ఒకటే-” డిగో మారడోనా”.
వెనుకబడిన లాటిన్ అమెరికా దేశాల నుండి బయలుదేరి ప్రపంచ ఫుట్ బాల్ శిఖరం పై విజయకేతనం ఎగరేసిన ఇద్దరు అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్ల లో మారడోనా ఒకడు. రెండో వాడు ” పీలే”.
ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే. కానీ వ్యక్తిత్వాలే వేరు.
అర్జెంటీనా దేశం మొత్తం మారడోనా మరణంతో (25.11.20 బుధవారం) దుఃఖంలో మునిగి పోయింది.
1986 లో అర్జెంటీనా రెండోసారి కప్ గెలవడానికి ఏకైక కారణమైన మారడోనా లేడు అన్న విషయం ఫుట్ బాల్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తన ఆటతో, వైద్య పూరితమైన వ్యక్తిత్వంతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న వాడు మారడోనా. మెక్సికో సిటీలో జరిగిన ప్రపంచ కప్పును మారడోనా ప్రపంచ కప్ గా  చెప్పుకుంటారు. ఒక ఆటగాడు దేశానికి ప్రపంచకప్ను అందించిన టోర్నమెంట్ అది.
మారడోనా ఫుట్ బాల్ జీవితంలో ప్రపంచకప్ కూడా అత్యుత్తమైన అద్భుతమైన ఉత్తమమైన అత్యుత్తమమైన గోల్ గా కీర్తించబడిన గోల్డ్ గోల్ ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మారడోనా చేశాడు. మొత్తం ఇంగ్లాండ్ టీం ని ఎదుర్కొని చేసిన ఆ గోలు ఎంత అద్భుతమో చూస్తే తప్ప తెలియదు.
దాదాపు ఏడు మంది ని తప్పించుకొని, గోల్ కీపర్ షిల్టన్ ను బోల్తా కొట్టించిన మిడ్ ఫీల్డర్ మారడోనా ఒక ఫుట్ బాల్ మాంత్రికుడు.
ఆ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మొదటిసారి మారడోనా లోని రెండు విభిన్న వ్యక్తిత్వాలను ఆవిష్కరించింది. ఫ్రెంచ్ పత్రిక “ఎల్ ఎక్విప్” మారడోనా ను “సగం దేవుడుదేవుడు -సగం దయ్యం”(half God-half Devil) అని చెప్పింది.
దీనికి కారణం ఇంగ్లాండ్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మారడొనా చేసిన రెండు గోల్స్. చేతితో ఒక గోలు – కాలితో ఒక గోల్ చేసిన మ్యాచ్ ఇదే.
మొదటిది మారడోనా ద్వారా. “హ్యాండ్ ఆఫ్ గాడ్” అని ప్రకటించబడిన గోలు, రెండవది ఈ శతాబ్దపు ఉత్తమ గోలు (goal of the century).
ఒక పత్రిక మారడోనా గురించి ” దేవుడి చేయి, దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయింది”(hand of god, went into the hands of God) అని రాసింది! బ్రెయిన్ కు చేసిన సర్జరీ విజయవంతమైన తర్వాత, హార్ట్ ఫెయిల్యూర్ తో మారడోనా దేవుడి దగ్గరికి వెళ్లి పోవడం కూడా మారడోనా వ్యక్తిత్వం లాంటిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *