అపుడే బ్లాక్ మార్కెట్ లోకి దూరిన కరోనా సూది మందు, ధర రు. 60 వేలు

అమెరికా వాళ్లు తయారు చేసిన  కరోనా సూది మందు  రెమ్డీసివిర్ (Remdesivir) అపుడే బ్లాక్ మార్కెట్ లో ప్రవేశించింది. దీనితో మొగ్గలోనే తుంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభిచింది.
మందు సీసా ధర  రు. 16వేల నుంచి రు 60 వేల దాకా పలుకుతూ ఉందని ట్రిబ్యూన్ ఇండియా రాసింది. దీని 100 మి.గ్రా సీసా గరిష్ట ధర  కేవలం రు. 5400.  దీనితో ఈ మందు బ్లాక్ మార్కెట్ దార్ల మీద దేశ వ్యాపింతంగా ఒక కన్నేసి ఉంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ మందును హ్యాండిలింగ్ చార్జెస్ కలుపుకుని ఆసుపత్రులలో రు.7,000 దాకా విక్రయిస్తున్నట్లు  మీడియా రాసింది.
కరోనా ముందుకోసం దేశమంతా తెగ ఆత్రంగా ఎదురుచూస్తున్నందున భారత ప్రభుత్వం ఈ మందును కోవిడ్ చికిత్సలో వాడేందుకు అనుమతించింది. కోవిడ్ బాధపడుతూ ఆక్సిజన్ పీల్చుకోలేకపోతున్న వారికి ఈ మందును వాడేందుకు  ప్రభుత్వం జూన్ 14 న అనుమతించింది. అయితే, ఈ మందును మెడికల్ షాపులలో అమ్మరాదని, తీవ్ర కోవిడ్ రోగుల మీద వాడేందుకు ఆసుపత్రులకు మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిబంధన కూడా విధించింది. అయితే, ఈ మందు బ్లాక్ మార్కెట్లోకి ప్రవేశించింది.  రెమ్డిసివిర్ ను బ్లాక్ మార్కెట్లో అత్యధిక ధరకు  విక్రయిస్తున్నారని భాతర ఆరోగ్య శాఖకు ఫిర్యాదులందాయి. దీనితో బ్ల్లాక్ మార్కెటీర్ల మీద దాడులు చేయాలని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా విజి సోమాని రాష్ట్రాలడ్రగ్ కంట్రోలర్స్ కు  లేఖరాశారు.
ఆమెరికా కంపెనీ గిలీడ్ (Gilead) తయారుచేసిన ఈ మందును భారత్ లో తయారు చేసేందుకు మూడు కంపెనీ (హెటిరో,సిప్లా, మైలాన్) లకు అనుమతి ఉంది. బ్లాక్ మార్కెట్ సమాచారం అందగానే తమ దగ్గిర ఉన్నస్టాక్ ను, సేల్స్ ను ప్రతిరోజు తెలియపర్చారని హర్యానా ప్రభుత్వం  డిస్ట్రిబ్యూటర్లకు,ఏజంట్లను ఆదేశించింది.
అత్యవసరం పరిస్థితులలో వాడేందుకు అనేక దేశాలు అనుమతించినా రెమ్డిసివిర్ ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. ప్రపంచబ్యాంక్ సాలిడారిటీ ట్రయల్స్ లో ఉన్న ఈ మందును అనేక దేశాలలో పరీక్షిస్తున్నారు. ఇదెలా పనిచేస్తున్నదో ఈ ప్రయోగాల నుంచి సమాచారం అందాకే తెలుస్తుంది.
చికిత్సకు పనికొచ్చే సూచనలు కనిపిస్తున్నపుడు ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాకొన్ని రకాల మందులను మెడికల్ ఎమర్జన్సీలో వాడేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తూంటాయి.
రెమ్డిసివిర్ కు  ఈ హోదా దక్కింది. అయితే, ఇపుడిది దారి తప్పిబ్లాక్ మార్కెట్ లోకి ప్రవేశించిందనే ఆందోళన మొదలయింది.
బ్లాక్ మార్కెట్ లోకి  ప్రవేశించేందుకు కారణం సమృద్ధిగా ఈ మందు తయారుకాకపోవడమేనని చెబుతున్నారు అనుమతి లభించిన  హెటిరో ఉత్పత్రి  ప్రారంభించింది. సిప్లా ఇపుడిపుడే  మొదలుపెట్టింది. మైలాన్ ఇంకా ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. ఈ కంపెనీకి ఇపుడిపుడే అనుమతి లభించింది.
హెటిరో గ్రూప్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ బండి మాత్రం తాము ఈ మందును కేవలం ఆసుపత్రులకు మాత్రమే సరఫరా చేస్తున్నామని చెప్పారు.ఈ మందు ప్రధానంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. మరీ ఎమర్జన్సీ కేసులయినపుడు  రోగుల  దగ్గిర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నపుడు సానుభూతితో రెమ్డి సివిర్ ను నేరుగా పేషంట్లకు ఇవ్వాలని కేంద్రం తమకు  సలహా ఇచ్చింది. అందువల్ల వ్యక్తులుగా పేషంట్లకు ఇచ్చిన ఇంజక్షన్ సీసాలు చాలా స్వల్పం,’ అని ఆయన అవుట్ లూక్ కు చెప్పారు.
అయితే, ఈ మందు కొరత బాగా ఉందని ఢిల్లీలోనిప్రముఖ ఆసుప్రతులు చెప్పినట్లు అవుట్ లూక్ రాసింది.‘ ఈ మందు బ్లాక్ మార్కెట్ లో మాత్రమే దొరుకుతూఉంది. కొనే వాడి అవసరాన్ని బట్టి ఈసీసాధర రు. 45,000 నుంచి రు.70,000 దాకా పలుకుతూ ఉంది.” అవుట్ లూక్ రాసింది.