రెడ్ స్టార్ మాదల రంగారావు కన్నుమూత

తెలుగులో ఎర్రజండాను నేరుగా సినిమా తెరకెక్కించిన రెడ్ స్టార్ మాదల రంగా రావు (71) కన్నుమూశారు. ఎర్రమల్లెలు, యువతరం కదిలింది వంటి విప్లవాత్మక సినిమాలు తీసి ఒక  కొత్త వరవడి తీసుకువచ్చిన రంగారావు అనారోగ్యంతో చనిపోయారు.

వారం రోజుల కిందట ఆయనను హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చికిత్సకోసం చేర్పించారు.ఒక ఏడాది కిందట ఆయన గుండెపోటు వచ్చింది. అపుడు ఆపరేషన్ జరిగింది. దురదృష్ణ వశాత్తు ఆ సమస్యమళ్లీ తలెత్తింది. తాజాగా ఆయన శ్వాసకోస సంబంధ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటలకు తుది శ్వాస విడిచారు. మాదాల గొప్ప నటుడే కాదు, నిర్మాత కూడా.

చైర్మన్ చలమయ్య సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు. తర్వాత సొంతంగా నవతరం పిక్చర్స్ ను ఏర్పాటు చేశారు. ఆయన తీసిన సనిమాలు యువతరం కదిలింది(1980) ఎర్రమల్లెలు(1981), మహాప్రస్థానం(1982), ప్రజా శక్తి (1983), వీరభద్రుడు(1984) వంటి చిత్రాలు బాగా హిట్టయ్యాయి. మాదాలకు జోహర్లు.

మాదాల మేడే సూర్యుడు :

విప్లవానికి మే నెలకు సంబంధం ఉంది. మే నెల 1వ తేదీని మేడేగా ప్రపంచ కార్మికులు జరుపుకుంటారు. మాదాల రంగారావు పుట్టుక, చావు రెండూ మే నెలలోనే జరిగాయి. అందుకే మాదాల మేడే సూర్యుడుగా నిలిచారు. మాదాల 1948 మే 25 ప్రశాశం జిల్లాలోని ఒంగోలులో జన్మించారు. 2018 మే 27 న హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాదాల గత శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు.

విప్లవ సినిమాల నిర్మాత మాదాల రంగారావు 71 సినిమాల్లో నటించారు.మాదాలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో ఒకరు మాదాల రవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మాదాల రంగారావు వారసుడిగా కొనసాగుతున్నారు.

ఎర్రపూలు, ఎర్రసూర్యుడు, ఎర్రమట్టి, ప్రజాశక్తి, ఎర్రపావురాలు, నవోదయం, మహాప్రస్థానం, కురుక్షేత్రం, వీరభద్రుడు, స్వరాజ్యం, ఎర్రమల్లెలు సినిమాల్లో నటించారు. ప్రజానాట్యమండలిలో సభ్యుడిగా కొనసాగారు.

మాదాల రంగారావు సినిమాలోని కాలేజీ కుర్రవాడ.. కులాసాగ తిరిగెటోడ అనే పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది.

మాదాల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ వామపక్ష నేతలు రామకృష్ణ, పి.మధు సంతాపం తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *