Home English రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన

149
0

రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వలస కార్మికులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆయన ఈ ప్రకటన చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు రైళ్ల సంఖ్యను పెంచుతున్నాము. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తమ సొంత స్థలాలకు పంపడానికి రైల్వే రోజుకి శాఖ 300 శ్రామిక్ రైళ్లను నడపనుంది. వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగివెళ్లేందుకు తగిన అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్దిస్తున్నాను. 3 నుండి 4 రోజుల్లో వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేరుస్తాము” అని పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.