Home Uncategorized తెలంగాణ కరెంటు కష్టాలు తీరిపోయాయి: తెలంగాణ జెన్కో సిఎండి

తెలంగాణ కరెంటు కష్టాలు తీరిపోయాయి: తెలంగాణ జెన్కో సిఎండి

89
0
రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సారిగా ఈరోజు ఉదయం విద్యుత్ పిక్ డిమాండ్ కు చేరుకుందని ప్రభాకర్ రావు, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ  తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నాటి డిమాండ్ కంటే  విద్యుత్ వినియోగం పెరిగిందని ఆయన వెల్ల డించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న 13162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండే కానీ ఈరోజు 13168 మెగా వాట్లకు కు చేరుకుందని, గత ఏడాది ఇదే రోజు 9620 మెగావాట్ల డిమాండ్ ఉండగా.. ఈరోజు 13168 మెగావాట్ల డిమాండ్ వచ్చిందని ప్రభాకర్ తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు.
విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగిన ఇబ్బంది ఏమి లేదని  సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
సీఎం కేసీఆర్ విద్యుత్ డిమాండ్ ఉంటుంది అని ముందే చెప్పారు అందుకు అనుగుణంగా మేము సరఫరాకు అంతరాయం కాకుండా చర్యలు చేపట్టడం జరిగింది.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు ముందస్తు చర్యలు తీసుకున్నాం. 13500 మెగావాట్ల డిమాండ్ వచ్చిన సరఫరా చేయగలం.
దేశంలో విద్యుత్ వినియోగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా మూడో స్థానంలో కర్ణాటక. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది.
హైదరాబాద్ మెట్రోరైలు కోసం 150 మెగావాట్ల విద్యుత్ అందిస్తున్నాము.
నాగార్జున సాగర్, శ్రీశైలంలలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో అక్కడి విద్యుత్ ను పిక్ అవర్స్ లో వాడుతున్నాం.
పంట సాగు, ఎత్తిపోతల పథకాల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. దానికి అనుగుణంగా విద్యుత్ అందించాలని సీఎం చెప్పారు. దాని ప్రకారమే ఇవ్వాళ విద్యుత్ సరఫరా చేస్తున్నాం