పాండవుల గుట్టలో స్టూడెంట్స్ ట్రెక్కింగ్

పాండవుల గుట్ట
అటవీశాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చారిత్రక ప్రాంతమైన పాండవుల గుట్టల్లో ఆదివారం రాక్ క్లైంబింగ్, రెప్పేల్లింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాలలో వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల నుండి జాతీయ సేవా పదకం నుండి నిర్వహిస్తున్న అడ్వెంచర్ క్యాంప్ లో భాగంగా నేడు 43 మంది N.S.S. విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
మరియు హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల డాక్టర్ లు 40 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

అనంతరం ఎదురు పాండవుల గుట్ట వద్ద మీసొలిథిక్ కాలానికి చెందిన రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ ని, ఆ పెయింటింగ్స్ లోగల జింకలు, చేపలు, తాబేలు, కప్ప, చిలుక, సీతాకోక చిలుక, ఏలుగు బంటి, పెద్ద పులి, ముళ్ల పంది, నెమలి బల్లి, కొండెన్గా, మొదలగు జంతువులు మానవాకృతులు మొదలగు జంతువులు మరియు రేఖ చిత్రములు ఎరుపు వర్ణములో చిత్రీకరించబడిన రాతి చిత్రాలను పాండవుల గుట్ట యొక్క విశిష్టతను గురించి వారికి ట్రెక్కింగ్ లో భాగంగా చూపిస్తూ వివరించారు.
అనంతరం నంది పర్వతం, శక్తి పర్వతం, జ్యోతి పర్వతం, భీముని గుండు, మేకల బండ వంటి శిలకృతులని తీసుకొని వెళ్లి వివరించడం జరిగింది. అక్కడ నుండి కుంతీదేవి గుహ వద్దకు తీసుకొని వెళ్లి గొంతెమ్మ గుట్ట కొండ చర్య యందు ఎరుపు వర్ణములో హస్త ముద్రలు, గదా యుద్ధము చేయుచున్న వీరుల చిత్రాలను గూర్చి వివరించడం జరిగింది.

ఎకో టూరిజం జిల్లా కోఆర్డినేటర్ కళ్యాణపు సుమన్, భూపాలపల్లి ఎఫ్.డి.ఓ. జి. సారయ్య, చెల్పూర్ ఎఫ్.ఆర్.ఓ. పూర్ణిమ పాండవుల గుట్ట ప్రాముఖ్యత గురించి వీరికి వివరించారు.
ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి ప్రసాద్, బీట్ అధికారి ఫయాజ్, పాండవుల గుట్ట రాక్ క్లింబింగ్ ఇన్స్ట్రుక్టర్లు భాస్కర్, శ్రీకాంత్, శశికుమార్, రవీందర్, రణధీర్ మరియు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ యొక్క రాక్ క్లింబింగ్ ఈవెంట్ లో పాల్గొనలనుకునే ఉత్సాహవంతులు, వివరాలకు బుకింగ్ కోరకు పాండవుల గుట్ట రాక్ క్లింబింగ్ ఇన్స్ట్రుక్టర్లని, ఈ నెంబర్ లో సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు 9441555524, లేదా మా వెబ్సైట్ ని సందర్శించి ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు అని నిర్వాహకులు తెలిపారు.
“www.ecotourism.bhupalpally.com”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *