ఎన్టీఆర్ బయోపిక్ లాంచ్ డేట్ ఖరారు

తెలుగునట సార్వ భౌముడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ఎన్టీఆర్ (బయోపిక్) నిర్మాణం తేదీ ఖరాయింది. తెలుగుదేశం పార్టీ సంస్థాపక దినం నాడే ఈ చిత్రం ఆరంభించాలని చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ సంస్థాపక దినం మార్చి 29. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. జనవరి 2019లో చిత్రం విడుదలవుతుంది.  చిత్రానికి తేజ డైరెక్టర్.

ఈ చిత్రంలో బాలకృష్ణ దాదాపు 72 పాత్రలలో కనిపిస్తారు.  చిత్రమేమిటంటే అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ,బాపు, సినారేలతో పాటు, పివి నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారు కూడా ఈ చిత్రంలో కనిపిస్తారు. చిత్రానికి  కీరవాణి సంగీతం సమకూర్చగా, బుర్రా సాయి ప్రసాద్ సంభాషణలు రాశారు. కల్యాణ్ రామ్ గారి అబ్బాయి చిన్న నాటి ఎన్టీఆర్ వేషంలో కనిపిస్తారు.

 

#Balayya Confirms #NTRBioPic will be launched on March 29th at Ramakrishna Cine Studios, Planning to release on Jan 2019 ✌👋 pic.twitter.com/ZjTMYs9YAh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *