Home Breaking ఆర్థిక శాఖ నుంచి నిర్మలాసీతారామన్ ని తప్పిస్తారా?

ఆర్థిక శాఖ నుంచి నిర్మలాసీతారామన్ ని తప్పిస్తారా?

71
0
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని మారుస్తారనే విషయం దేశరాజధాని మీడియా వర్గాల్లోరాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ఆమె ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చపట్టినప్పటినుంచి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడలేదు. నిజానికి ఇందులో ఆమె ప్రమేయేమీ లేకపోయినా, అనేక అంతర్జాతీయ పరిణామాలు అనుకూలంగా లేక భారతీయ ఆర్థికప్రగతి చతికిలా పడిన మంత్రిగా ఆమె మీదఅక్షింతలుపడక తప్పదు.నిజానికి ఆర్థిక మంత్రిగా మునుపు అరుణ్ జైట్లీకి ఉన్నంత స్వేచ్ఛ అమెకు ఉన్నట్లు కనిపించదు.
ఆరుణ్ జైట్లీ ప్రభుత్వంలోనెంబర్ త్రీగా కనిపించే వారు. ఎపుడూ వార్త లో ఉండే వారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడనే పేరూ ఉండింది. ఈ హోదా నిర్మలాసీతారామన్ కు దక్కలేదు. ఆమె క్యాబినెట్ లో ఒక మంత్రి అయ్యారు తప్ప వెలుగులో లేరు.
వెలుగులో ఉండేది ఇద్దరే, ప్రధానిమోదీ,హోమ్ మంత్రి అమిత్ షా. దీనితో ఆమెచొరవ తీసుకోవడం లేదనో, ఆమె శక్తి సామర్థ్యాలు ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు పనికిరావనో విమర్శ వస్తూనే ఉంది. దానికితోడు డా. సుబ్రమణియన్ స్వామి వంటి వారు ఆమె తొలినుంచి విమర్శులుచేస్తున్నారు. ఆమె గురించి డా. స్వామి బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నా, ట్విట్టర్ కామెంట్ లు పెడుతున్న పార్టీ వారించినట్లు కనబడదు.
ఈ మధ్య కాలంలో కేంద్రంలో బాగా చురుకుగా కనిపిస్తున్న వ్యక్తి రైల్వే శాఖ, వాణిజ్య శాఖలను చూస్తున్న పీయూష్ గోయల్. క్యాబినెట్ మంత్రుల్లో ఆయనకు చాలా మంచి పేరొచ్చింది. అరుణ్ జైట్లీ అనారోగ్యంలో అమెరికాలో చికిత్స చేయించుకుంటున్నపుడు కొద్ది రోజులు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. నిజానికి 2014 ఎన్నికల తర్వాత ఆయనే ఆర్థిక మంత్రి అనుకున్నారు. తీరా చూస్తే ఆ పదవి నిర్మలా సీతారామన్ కు దక్కింది. అయితే, ఆర్థిక మంత్రి గా ఆమె పరిస్థితులప్రభావం వల్ల బాగా విమర్శలు పాలవుతున్నారు, అపకీర్తిపాలవుతున్నారు.
ఇపుడు ఏకంగా ఆమెను ఆర్థిక శాఖ నుంచి తప్పిస్తారని, ఆ బాధ్యతలను పీయూష్ గోయల్ కు అప్పగిస్తారని అంటున్నారు. అపుడామెను వాణిజ్య శాఖ కే తెస్తారేమో తెలియదు గాని, ఆమెను మారుస్తారనే చర్చ జోరుగాసాగుతూ ఉంది.
దీనికి సాక్ష్యంగా గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటుచేసిన ఒక కీలకమయిన సమావేశంలో ఆర్థిక మంత్రి అయిన నిర్మలాసీతారామన్ లేకపోవడమే. ఆర్థిక వ్యవస్థ పతనమవుతూఉందన్న నేపథ్యంలో భవిష్యత్తు గురించి చర్చించేందుకు ప్రధాని పలువరు పారిశ్రామిక వేత్తలతో సమావేవమయ్యారు. ఈ సమావేశంలో రైల్వే మంత్రిపీయూష్ గోయల్,హోమ్ మంత్రి అమిత్ షా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ తదితరులుహాజరయ్యారు. నిర్మలా సీతారామన్ లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించడంతో ఆమె కుఉద్వాసన అనే చర్చ మొదలయింది.ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద చర్చ జరుగుతున్నపుడు ఆర్థిక మంత్రి లేకపోవడానికి మరొక వ్యాఖ్యానం ఏముంటుంది?
నీతి ఆయోగ్ లో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నపుడు సీతారామన్ ఎక్కడున్నారో తెలుసా? బిజెపి కార్యాలయంలో పార్టీ నేతలతో ఆమె సమావేవమయి ఉన్నారు.
దీనికి పార్టీ ఇచ్చిన వివరణ ఏంటంటే… ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ముందు చర్చలకోసం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులతో, అధికార ప్రతినిధులతో, మోర్చా సభ్యలతో, వివిధ శాఖల ప్రతినిధులతో సమావేశమయి ఉన్నారని బిజెపి ట్వీట్ చేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థ మీద చర్చకంటే ప్రీబడ్జెట్ చర్చలు అంత ముఖ్యమా, అందునాపార్టీ నేతలతో. దీని మతలబు మరేదో ఉందనిఅంతా అనుకుంటున్నారు.