చంద్రబాబు అస్తులివే… తాత కంటే మనవడే రిచ్…

అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం సభ్యుల ఆస్తుల వివరాలు కుమారుడు నారా లోకేష్ ప్రకటించారు.
దాని ప్రకారం చంద్రబాబు నాయుడు  ఆస్తులు రూ.9కోట్లు. మొత్తం అప్పులు రూ.5.13 కోట్లు.నికర ఆస్తులు రూ.3.87కోట్లు.
గత ఏడాదితో పోలిస్తే రూ.87లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో).బ్యాంక్ లోన్ రూ.18లక్షలు తగ్గింది.
ఆయనకు ఉన్న కారు పాత కారు అంబాసిడర్ (1993-94) విలువ రు 1.52 లక్షలు,సేవింగ్స్ ఖాతాలతో ఉన్న మొత్తంతో పాటు చేతిలో ఉన్న నగదు రు, 74.10 లక్షలు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 6లో లోకేశ్ తో కలిసి కట్టు కున్నఇల్లు. విలువ రు.8,01,38,000.
*నారా భువనేశ్వరి ఆస్తులు మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు.మొత్తం అప్పులు రూ.11.04 కోట్లు.నికర ఆస్తులు రూ.39.58 కోట్లు.గత ఏడాదితో పోలిస్తే రూ.8.50కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)
ఖరీదైన వజ్రాలు పొదిగిన బంగారు అభరణాలు 3519 గ్రాములు. వాటి విలువ 1,27,16,000. 8.7లక్షల రుపాయల విలువయిన 42.41 కిలో వెండ వస్తువులున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ లో 1,06,61.652 షేర్లున్నాయి.వాటి విలువ19,95,40,000.00 పిఎఫ్ ఖాతాలో రు. 45 లక్షలు,బ్యాంక్ బ్యాలెన్స్ .130లక్షలున్నాయి. మొత్తం ఆస్తులు రు. 50.62 కోట్లు. అప్పులు 10.04 కోట్లు. నికర ఆస్తులు రు. 39.58 కోట్లు.
*నారా_లోకేష్ ఆస్తులు రూ.24.70 కోట్లు.మొత్తం అప్పులు రూ.5.70 కోట్లు.నికర ఆస్తులు రూ.19 కోట్లుగత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల (నికర ఆస్తిలో)
ఒక ఫోర్డ్ ఫిఎస్తా, రెండు బుల్లెడ్ ప్రూఫ్ ఫార్చూనర్ కార్లు న్నాయి. వాటి విలువ రు. 92.49లక్షలు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 65లో తండ్రి చంద్రబాబు నాయుడుతో కలసి 1285 గజాలలో కట్టుకున్న ఇల్లుంది. దాని విలువ రు. 10.35 కోట్లు.
హెరిటేజ్ ఫుడ్స్ లో 47,32,800 షేర్లున్నాయి.వాటి విలువ 2.52 కోట్లు. మదీన గూడ ప్రాంతంలో ఐదు ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉంది. అది అమ్మమ్మ బహుమతిగా ఇచ్చినదిగా చూపించారు. మొత్తం ఆస్తులు రు.24.70 కోట్లు. అప్పుడు 5.70కోట్లు.నికర ఆస్తులు రు.19 కోట్లు.
* కోడలు నారా బ్రాహ్మణి ఆస్తులు మొత్తం ఆస్తులు రూ.15.68 కోట్లు.మొత్తం అప్పులు రూ.4.17 కోట్లు.నికర ఆస్తులు రూ.11.51 కోట్లు.గత ఏడాదితో పోలిస్తే రూ. 3.80 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)
మాదాపూర్, మణికొండ, జూబ్లీ హిల్స్ లలో ఇళ్ల స్థలాలు, భూములున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ లో2,02,000 షేర్లున్నాయి. వాటి విలువ రు.78.51 లక్షలు. నిర్వహణ హోల్డింగ్స్ లో రు. 1.82 కోట్ల విలువయిన షేర్లున్నాయి. 310.06 క్యారట్ల విలువయిన రాళ్లు పొదిగిన 2,501. 34 గ్రాముల బంగారు నగలున్నాయి. మొత్తం ఆస్థుల విలువ రు.15.68 కోట్లు. అప్పులు 4.17 కోట్లు. నికర ఆస్థులు 11.51కోట్లు.
* మనవడు నారా దేవాన్ష్ ఆస్తులు. మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు.గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో). నారా దేవాన్ష్‌కు తాత బాలకృష్ణ హెరిటేజ్‌‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు. ఫిక్సడ్ డిపాజిట్లు రు. 3.18 కోట్లు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65 లో1325 .56 చ.గజాల స్థలం ఉంది. విలువ 16.17 కోట్లు. నికర ఆస్తిరు. 19.42 కోట్లు.
*ని ర్వహణ  హోల్డింగ్స్ (చంద్రబాబు కుటుంబ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ) మొత్తం అప్పులు రూ.37.20 కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85 కోట్లకు తగ్గుదల. నికర ఆస్తులు రూ.9.10 కోట్లు.
గత ఏడాదిలో రూ.2.27 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)