మంత్రి సీదిరి అప్పలరాజు చెబుతున్న ‘సంతబొమ్మాళి రహస్యం’

(డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చుని రోజూ జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో సంత బొమ్మాళిలో ఒక గుడిలో ఉన్న నందీశ్వరుడ్ని కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి, రోడ్డు మీద ఉన్న దిమ్మ మీద పెట్టేందుకు ప్రయత్నించడం, అది సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వటం చూశాం.

దీని గురించి చంద్రబాబు నాయుడు, మిగతా ప్రతి పక్షాలు ఎందుకు మాట్లాడటం లేదు.? ఇందులో తెలుగుదేశం పాత్ర స్పష్టంగా కనిపించేసరికి మీ నోళ్ళు పెగలటం లేదా?

ఈ విషయంలో చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత కొంతకాలంగా మీరు చేస్తున్న విగ్రహ రాజకీయాల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? ప్రజలకు మీరు ఏరకమైన సందేశం ఇవ్వదలచుకున్నారు.

లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మీరు ప్రజలను భ్రమింపజేసి, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న రాజకీయాలను, వాటిని మీ అనుకూల మీడియాలో ప్రభుత్వంపై పెద్దఎత్తున దుష్ప్రచారం చేయడం చూస్తున్నాం.

చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే.. జల్లెడ వెళ్ళి సూదిని వెక్కిరించిందన్నట్టుగా ఉంది. జల్లెడకు రంథ్రాలు ఉన్నట్టు, ఆయనకు వంటి నిండా రంధ్రాలే. ఆయన ఈ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.

సంతబొమ్మాళి ఘటనలో నందీశ్వరుడి విగ్రహాన్ని తరలిస్తూ  సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి శిష్యులు, టీడీపీ కార్యకర్తలతో పాటు ఎల్లో మీడియాకు చెందిన ఒక విలేఖరి కూడా ఉన్నారు.

దీనినిబట్టి చూస్తే.. రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి చంద్రబాబే స్వయంగా ఆదేశాలు ఇచ్చినట్లు కనిపిస్తుంది.

సంతబొమ్మాళి ఘటనలో పోలీసులు మొత్తం 22 మందిపై కేసులు పెడితే అందులో అచ్చెన్నాయుడు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.

ప్రజల్లో ఒక అనిశ్చితి, గందరగోళాన్ని సృష్టించి అరాచకానికి చంద్రబాబు, టీడీపీ కుట్రలు పన్నినట్లు ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది.

 

(ఈ రోజు సీదిరి అప్పల రాజు ప్రెస్ మీట్ పాయింట్స్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *