కెసిఆర్ హూజూర్ నగర్ పర్యటన రద్దు… వర్షం కారణం

భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది. హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడడంతో పాటు, మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కెసిఆర్ హూజూర్ నగర్ ఎన్నికల పర్యటన మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, అక్కడి సభలో ఆయన ఆర్టీ సి సమ్మె గురించి కీలకప్రకటన చేస్తారని భావించారు. ఆర్టీసి సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని, కార్మికులతో చర్కించేది లేదని, వాళ్లంతా సెల్ఫ్ డిస్మిస్డ్ వాళ్లని ఆయన అన్నారు. అయితే హైకోర్టు ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిచింది. చర్చలు జరపాలంది. వాళ్లు కూడా ప్రజలేనంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంచెప్పబోతున్నారోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఇలాంటపుడు వర్షం అడ్డొచ్చింది.  ఆయన పర్యటన వాయిదా పడింది.

అయితే, ఈ రోజు హుజూర్ నగర్ లో పెద్ద వర్షం వచ్చింది.   సభా స్థలంలో వర్షం కారణంగా  సభ జరపలేని  పరిస్థితి వచ్చింది. దీనితో సభను జరిపే పరిస్థితి లేదని తెలిసింది. ఫలితంగా కెసిఆర్ పర్యటనకూడా రద్దయిందనిచెబుతున్నారు.