Home Uncategorized ‘జాతి రత్నాలు’ కు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్

‘జాతి రత్నాలు’ కు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్

232
0

జాతి రత్నాలు కు క్లీన్ యూ సర్టిఫికేట్

        నవీన్ పోలిశెట్టి నటించిన జాతి రత్నాలు కు క్లీన్ యూ సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. ఈ విషయం నిర్మాత, మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్  ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. పూర్తి స్థాయి విభిన్న కామెడీగా రూపొందించిన ఈ మూవీలో మరోసారి నవీన్ పోలిశెట్టి ఫన్ చూడాలి. నవీన్ గత చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లో ఫుల్ ఫన్ ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు. నవీన్ పోలిశెట్టికి తోడుగా కామెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల ఫన్ ఇంకో ఎత్తు. ఈ ముగ్గురూ ఒక కారణం చేత జైల్లో పడ్డాక, ఫేమస్ అవడానికి ఒక ప్లాన్ వేస్తారు. కొత్త దర్శకుడు అనూప్ కెవి దర్శకత్వంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఇది వుంటుందని నాగ్ అశ్విన్ లు వెల్లడించారు.

ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మురళీశర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ ఇతర తారాగణం. సంగీతం రాధాన్, ఛాయాగ్రహణం సిద్ధం మనోహర్, నిర్మాణం స్వప్న సినిమా. మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here