వర్క్ ఫ్రం హోమ్ కు అనుకూలంగా ఆంధ్రా గ్రామాలు… జగన్ నిర్ణయం

కరోనా అనంతరం ఏర్పడిన వర్క్ ఫ్రం హోం పరిస్థితులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ లో   అంతరాయాలు లేని ఇంటర్నెట్‌ అనేది లక్ష్యం పెట్టుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇటీవలి కాలంలో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించడంతో వేలాది మంది యువకులు తమ ఐటి ఉద్యోగాలను మారుమూల గ్రామాలనుంచే నిర్వహిస్తున్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆంధప్రదేశ్ గ్రామాలకు హైస్పీడ్, అన్ లిమిటెడ్ నెట్ వర్క్ ను అందుబాటులోకి తెచ్చే విషయం పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రతి గ్రామానికీ అన్‌ లిమిటెడ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని,
గ్రామంలో నెట్‌వర్క్‌ పాయింట్‌ నుంచి ఇంటింటికి ఇంటర్నెట్‌ కనెక్షన్ ఉండాలని, ఇదే విధంగా వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ తీసుకురావాలని ఆయన ఆదేశించారు.

గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో  ల్యాప్‌టాప్‌ల పంపిణీలో ల్యాప్ టాప్ లను అందించే విషయం గురించి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

 సమావేశంలో జగన్ ఆదేశించిన ముఖ్యాంశాలు:

హెచ్‌టి లైన్‌ నుంచి సబ్‌ స్టేషన్‌ వరకూ, సబ్‌ స్టేషన్‌ నుంచి పంచాయతీల వరకూ అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ తీసుకెళ్లేలా ఆలోచన చేసి, ముందుకు సాగాలి.

గ్రామ పంచాయతీ వరకూ అన్‌ లిమిటెడ్‌ నెట్‌వర్క్‌ను తీసుకు వెళ్లాలి.

వినియోగదారుడు ఏ సామర్థ్యం కనెక్షన్‌ కావాలన్నా ఇచ్చేలా ఉండాలి.

పంచాయతీ నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి ఒక సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

గ్రామాల్లో నెట్‌వర్క్‌ పాయింట్‌ వద్ద ఇంటర్నెట్‌ లైబ్రరీ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి. దీని వల్ల సొంత గ్రామాల్లోనే ఉంటూ వర్క్‌ ఫ్రం హోం (WFH)  కు అవకాశం ఉంటుంది

అమ్మ ఒడి, వసతి దీవెన లబ్ధిదారుల్లో ఎవరైనా నగదుకు బదులు ల్యాప్ టాప్ కావాలంటే  అందించగలగాలి.

9వ తరగతి నుంచి 12వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులకు ఆప్షన్‌గా ల్యాప్‌ టాప్‌.

ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థుల అవసరాలు పూర్తిగా తీర్చేలా మరిన్ని స్పెసిఫికేషన్లతో కూడిన ల్యాప్‌టాప్‌లపైనా ఆలోచన చేయాలి.

వచ్చే ఏడాది ‘అమ్మ ఒడి’ చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలి.

ల్యాప్‌టాప్‌ చెడిపోతే, దాన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇస్తే, వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలి. లేదా రీప్లేస్‌ చేయాలి.

అందుకే కంపెనీ మెయింటెనన్స్‌ను ఏడాది కాకుండా మూడేళ్లు పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *