Home Uncategorized మతమార్పిడుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద ఏది?: పవన్ ప్రశ్న

మతమార్పిడుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద ఏది?: పవన్ ప్రశ్న

63
0
చిత్తూరు జిల్లాలో  సాగిస్తున్న జనసేన ఆత్మీయ యాత్రలోభాగంగా జనసేన అధ్యక్షుడు మదనపల్లి టమాటో మార్కెట్ ను సందర్శించారు. అక్కడ రైతులతో సంభాషించారు. ముఖ్యమంత్రి జగన్ మీద ఈ సందర్భంగా తీవ్రమయిన వ్యాఖ్యాలు చేశారు. మత మార్పిడుల మీద ఉన్న ఉత్సాహం రైతుల మీద ముఖ్యమంత్రి జగన్ కు లేదని పవన్ వ్యాఖ్యానించారు. ఇపుడు ఇంగ్లీష్ మీడియం కాదు, రైతులకు గిట్టుబాటు ధర అని అయన అన్నారు. నడుం విరగ్గొట్టకుని కష్టపడుతున్నా గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారు, పనులు లేక భవననిర్మాణ కార్మికులు ఇక్కట్లపాలయ్యారు. ఇలా జరుగుతున్నాముఖ్యమంత్రికి మత మార్పిడుల మీదే ఎక్కువ శ్రద్ధ ఉందని ఆయన అన్నారు.