ఢిల్లీలో జగన్ విలువెంత? సిపిఐ రామకృష్ణ ఇలా చెబుతున్నారు

రాజధానిలో  ఢిల్లీలో ఒక ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కేంద్ర ప్రభుత్వం  ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.అయినా సరే, ఈ లాంటి ఢిల్లీ పర్యటనలను చూపి ఆయన రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారని ఆయన విజయవాడలో వాఖ్యానించారు.

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అని చెపుతున్నారు, బాగానే ఉంది. కేంద్రం ఎన్ని డిమాండ్లకు అంగీకారం తెలిపిందో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీ పర్యటనల విషయంలోగతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు చేసిన మోసాన్ని ఇపుడు జగన్ కూడా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

 జగన్ ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్లారో, ఏమి సాధించారో,   సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంజగన్ ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఢిల్లీ పర్యటన వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల రాష్ట్రానికి మళ్లీ అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మీడియాపై దాడులు పెరుగుతున్నాయని, ఇలాగే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటికి పోలీసులు వెళ్లి ఆమె భర్తను అరెస్ట్ చేయాలంటూ హడావుడి చేయడం ఏంటి ? అని ఆయన ప్రశ్నించారు.

ఇది పూర్తిగా ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని చెబుతూ ఎన్జీ రంగ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ పై ఎస్ సి ఎస్ టి చట్టం కింద కేసు పెట్టడం ఏంటి ? రాష్ట్రంలో కక్షపురిత రాజకీయం నడుస్తోందని ఆయన అన్నారు.